పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/101

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
82
ప్లూటార్కు వర్ణితచరిత్రలు


దని మఱియొకఁడు; ఇటుల వీరిరువురు గ్రుద్దులాడిరి. అంతలో వారి యుద్యోగకాల మంతరించెను.

ఇంతలో ప్రజారాజ్యమును ధ్వంసము చేయుటకు 'కటలీను' పేరుగలవాఁ డొకకుట్రను పన్నెను. అందులో 'క్రాసస్స' 'సీౙరు' కలిసియుండిరని వదంతి పుట్టెను. 'వక్తశిశిరో' సభలో క్రాసస్సు కుట్రకారుఁ డని ప్రసంగించెను: వీరిరువురకు మనస్పర్ధలు రగిలెను. క్రాసస్సు నిర్దోషి యని వెల్లడి యయ్యెను. శిశిరోను జంపుట కతఁ డద్యుక్తుఁ డయ్యెను. కాని యతని కుమారుఁ డతని నాటంకపఱచెను.

కాలాంతరమున పీౙరు అక్షదర్శకుని (Consul) పనికి నిలఁబడుటకు యత్నించెను. కాని పాంపేయుఁడు క్రాసస్సుల కంతఃకలహము లుండుటచేత ముందుగ వారిని మిత్రులుగ చేయఁజూచెను. వారినిఁ గలిపి వారితో నతఁడుఁ గలిసినందున వారు మువ్వు రజేయులుగ నుండిరి. ఈ మువ్వురి ప్రభుత్వములో పాంపేయునికి గాని క్రాసస్సునకు గాని మేలు లేక పోయెను. సీౙరు వారి సహాయముచేత ప్రజారాజ్యమును మార్చుటకు తగిన ప్రయత్నములను జేయుటకు వీలయ్యెను, వీరు మువ్వు రక్షదర్శకులుగ నుండిరి. సీౙరు పనులను బాగుగ నెరవేర్చుచున్నందున నతనిని సేనాధిపతిగ నియోగించిరి. అధికారమును విశేషముగ నడిపించవలె నని 'సాంపేయు'నికి వాంఛ కలిగెను. దురాశకు తోడు సీౙరువలెఁ గీర్తి ప్రతిష్ఠలను సంపా