పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కసు క్రాసస్సు

81


చుండెను. అందుచేత క్రాసస్సును బ్రజలు ప్రేమించిరి. ఐనను వీరిరువురు మహా ప్రౌఢులు. ప్రబోధనశక్తిగలవారు. వారి ముఖవర్చస్సు ప్రజల నాకర్షించెను.

ఈ కాలములో రోములో నధికారులు మూడు కక్షలుగ నుండిరి. శాంతముగ వ్యవహారములను నడుపుట కిష్టముఁ గల వా రందఱకు పాంపేయుఁడు నాయకుఁడు. విచారించక ధారాళముగ కార్యములను నెరవేర్చుటకు సమకట్టినవారికి సీౙరు నాయకుఁడు. ఏపక్షము నొందక ముభావముగ నున్నవారిలో ప్రధానుఁడు క్రాసస్సు. అతఁడు కాలోచితముగ పక్షములను మార్చుచు స్వలాభమున కతఁ డేయెండ కా గొడుగును పట్టుచుండెను.

ఈలోపున దేశములోని మల్లులంద ఱేకీభవించి పితూరి చేసిరి. . వారిని దండించుటకు 'క్రాసస్సు' సేనాధిపత్యమును బుచ్చుకొని దండుతో వెడలెను. వారి నతఁడు దరిమి జయమును బొందుకాలములో 'పాంపేయి' వచ్చి పరారియైనవారిని బొడిచి చంపెను. కష్టపడినవాఁడు క్రాసస్సు; వీరకిరీటమును బొందినవాఁడు పాంపేయుఁడు. కొంతకాలమునకు పాంపేయునకు అక్షదర్శకోద్యోగము (Consulship) లభించెను. క్రాసస్సునం దభిమానముచేత నతఁ డితని కా యుద్యోగము మఱియొకటి సమకూర్చెను. కాని కొన్ని రోజులకు వారిరువురు కలహించిరి. పనులలో కూడు నని యొకఁడు కూడ