పుట:Madrasu Government Yokka Pradhana Manthiriga Undina Sriyutha Gourava Deewan Bahadur Bollini Manuswamy Nayudu Gariokka Jeevitha Charitramu.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రుగా నామినేటుచేసి వైస్‌ ప్రెసిడెంటుగా చేసిరి. నాయుడుగారు యేపనిలో పూనినప్పటికిన్ని శ్రద్ధగా పనిచేయు వారుగా యుండుటవల్ల లోకల్‌బోర్డు చట్టమును (Local Board's Act) బాగుగా చదివిరి. 1920 సంవత్సరమున మదరాసు శాసనసభకు ప్రతినిధిగా నెన్నుకోబడిరి. పిదప డిస్ట్రిక్టుబోర్డు ప్రెసిడెంటు పదవికి వచ్చిరి. తనకు స్వతంత్ర అధికారమువచ్చిన తరువాత స్వలాభము నెదురుచూడక రైతుల కష్టములను నివర్తించుటకు ప్రారంభించిరి.

5. రైతులు గ్రామములనుంచి యితర యూర్లకు పోవుటకున్ను తమ ధాన్యమును బండ్లమీద తీసుకొనిపోయి బయటి యూర్లలో సరియైనధరలకు అమ్ముటకున్ను వీలులేక చాలా కష్టపడుచుండిరి. తమ పిల్లకాయలను చదువుకొనుటకు పాఠశాలలుండు ప్రక్కగ్రామమునకు పంపుటకు సాధ్యములేక కష్టపడుతూయుండిరి. ఎట్టి యభివృద్ధికిన్ని రాకపోకలకున్ను అవశ్యమైనది రోడ్లుఅని తీర్మానించి రోడ్లులేని గ్రామములకు రోడ్లువేయను ప్రారంభించిరి. విలేజిరోడ్లు వేసినపిదప రాకపోకలకు సులభమాయెను. రైతులకేకాక సమస్తజనులకున్ను సౌకర్యము కలిగెను. రైతుల కష్టములను తొలగించుటకు కంకణ బద్ధుడై యుండిరి.

6. గవర్మెంటువారివల్ల నేమింపబడిన (Agricultural Commission) అగ్రికల్చెరల్ కమిషన్ (వ్యవసాయ కమిషన్) Banking Enquiry Committee బ్యాంకింగు ఎన్‌కొయరి కమిటీలో మెంబరుగా పనిచేసిరి.