పుట:Madrasu Government Yokka Pradhana Manthiriga Undina Sriyutha Gourava Deewan Bahadur Bollini Manuswamy Nayudu Gariokka Jeevitha Charitramu.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరామజయం.

1. ప్రపంచములోనుండు వృత్తులన్నిటి పైకి రైతు వృత్తి చాల శ్రేష్ఠమైనది. పుణ్యమైనది. పాపము లేనిది. ఇహలోకములో కీర్తియు, పరలోకములో మోక్షము నిచ్చునది. బానిసత్వమును పోగొట్టునది. స్వతంత్రము నిచ్చునది. క్షుద్బాధను తీర్చునది. దరిద్రమును పోగొట్టునది. ఎల్లప్పుడు సంతోషము కలుగచేయునది.

2. రైతు కులములో పుట్టినటువంటిన్ని మదరాసు గవర్మెంటులో ప్రధానమంత్రిగా యుండినటువంటిన్ని శ్రీయుత గౌరవ దివాన్ బహదూరు బొల్లిని మునుస్వామినాయుడుగారి యొక్క చరిత్రమును నాకు తెలిసినంతమట్టుకు వ్రాయుచున్నాను. భాషయందుగాని యితర నేవిధములందుగాని తప్పులేదైనా యుండిన క్షమించవలయునని ప్రార్థిస్తున్నాను.

3. ఈయన కమ్మవారు కులమునకు చేరినవారు. తిరుత్తణి తాలూకా వేలంజేరి గ్రామములో మ-రా-రా-శ్రీ, బొల్లిని బొజ్జినాయుడుగారి యొక్క ద్వితీయపుత్రుడు. తారణ సంవత్సరమున జన్మించిరి. బాల్యమందు వేలంజేరి గ్రామంలో వీధిబడిలో ప్రారంభవిద్య నేర్చుకొనిరి. వెనుక తిరుత్తణి గ్రామములో ఇంగ్లీషు భాషను 3-వ ఫారము వఱకు చదివిరి. హైస్కూలులో చదువుటకుగాను వీరి తండ్రిగారు మదరాసులో ఒక సంసారము పెట్టి వీరినిన్ని యితర పిల్లకాయలను చది