పుట:Madrasu Government Yokka Pradhana Manthiriga Undina Sriyutha Gourava Deewan Bahadur Bollini Manuswamy Nayudu Gariokka Jeevitha Charitramu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. భగవంతుడు తెలివి మానవకోటి కందరికిని యిచ్చియున్నాడు. దానిని వృద్ధిపరచినయెడల అందరున్ను వున్నత పదవికి రావచ్చును అనే తత్వమును దృష్టాంతముగా చూపిరి.

9. ప్రేమనే భగవంతుడు ప్రేమవల్లనే ప్రపంచములో సమస్తమును జయించవచ్చును అని మహాత్మా గాంధిగారి తత్వమునున్ను మ.రా.రా.శ్రీ, నాయుడుగారికి ఆప్తస్నేహితులలో యొకరైన మ.రా.రా.శ్రీ, చిత్తూరులో నివసించు వక్కీలు జే. క్రిష్ణరావుగారు రచియించిన క్రిందవ్రాసియుండు పద్యములో కనియుండు అంశములను అనుష్ఠానమునకు తెచ్చుచుండిరి.

శ్రీయుత దివాన్ బహదూరు B. మునుస్వామినాయుడుగారి

యొక్క గుణములలో కొన్నిటిని మాత్రము

క్రింద వ్రాసియున్నది.

1. శాంతస్వభావులు, కోపమేలేనివారు, దుర్భాషణములెఱుగరు.

2. ఎవరికిని ఎన్నడును కీడుచేసి ఎఱుగరు. శక్తివంచన లేక ఎల్లఱకును సాయముచేసినవారు.

3. రాజకీయాది ప్రజావిషయక కార్యములందు తన యాజ్ఞలో యుండువారు వెలిబుచ్చు స్వతంత్రాభిప్రాయముల జోక్యము గలిగించుకొనువారుగారు.