పుట:Madrasu Government Yokka Pradhana Manthiriga Undina Sriyutha Gourava Deewan Bahadur Bollini Manuswamy Nayudu Gariokka Jeevitha Charitramu.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

1. అడవుల విషయయలో పోరాడి పట్టా భూమికి ఒక మైలు దూరము వరకు రిజర్వు ఫారస్టు యుండగూడదని తీర్మానము ప్యాసు చేయించిరి.

2. అడవి పంచాయతుల నేర్పాటు చేయించి పశువులు మొదలగు వాటిని మేపుకొనుటకు అడవులను పంచాయతీ దార్ల స్వాధీనము చేయించిరి.

3. పశువుల చికిత్సలకుగాను యొకఆస్పత్రి చిత్తూరు జిల్లాలో పెట్టించిరి.

4. డిస్ట్రిక్టుబోర్డు ప్రెసిడెంటుగాయుండిన కాలములో అనాదరణ చేయబడినటువంటి గ్రామములకు రోడ్లు వేయించిరి.

5. చంద్రగిరి రెంటు కోర్టుక్యాంపుపోతూ యుండినందువల్ల జమీందారీ యిలాఖా రైతులకు కోర్టుకు పోవుటకుగాను శెలవులు యెక్కువ అగుతూ యుండినది. దానిని తగ్గించుటకు సం|| కోర్టు చంద్రగిరిలోనే ఖాయముగా యుండవలయునని యేర్పాటుచేయించిరి.

6. మంత్రి పదవి వచ్చినతర్వాత బండ్లకు డిస్ట్రిక్టుబోర్డు టోలు గేట్లకు రైతులు చెల్లించుతూ యుండిన టోలుగేటు పన్నును తోసివేయవలయునని చట్టము ప్యాసుచేయించిరి.

7. Electric Corporation వగైరా వుద్యమములలో పనిచేయుటకు మనదేశస్తులకు సహాయము చేసిరి.