పుట:Madrasu Government Yokka Pradhana Manthiriga Undina Sriyutha Gourava Deewan Bahadur Bollini Manuswamy Nayudu Gariokka Jeevitha Charitramu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రైతులు డిస్ట్రిక్టు బోర్డు టోలుగేట్లకు బండ్లకు చెల్లించుతూ యుండిన పన్నును తీసివేయుటకు చట్టమును ప్యాసు చేయించిరి.

9. ఇదివరకు గవర్మెంటులో (Electric Corporation) వగైరా వుద్యమములను పనిచేయుట యూరోపియను కంపెనీలకే నిచ్చుచుండిన స్వతంత్రమును మనదేశస్తులున్ను వారితోపాటి యిటువంటిపనులు చేయుటకు శక్తిసామర్థ్యములో ఎంతమాత్రమున్ను తక్కువ అయినవారుకారు అని నిరూపించుటకు మన రాజధానిలో కోయముత్తూరు, నీలగిరి, చిత్తూరు మొదలగు యూర్లలో, (Electric Corporation) లను స్థాపించుటకు సహాయము చేసిరి. ఈయన యింత గొప్పపదవికి రావడం చిత్తూరు జిల్లాకు గొప్పగౌరవమేగాక మఱియు మదరాసు రాజధానిలో యుండు కమ్మవారు కులమునకే యొక కిరీటమువలె వెలుగుచుండిరి. ఈయన ప్రధానమంత్రిగా యుండినకాలములో జస్టిసుకక్షిలో భిన్నభిప్రాయములు కల్గినందున తన మనస్సాక్ష్యమునకు విరుద్ధముగా ప్రవర్తించుట కిష్టములేదని తెలుపుచు మంత్రిపదవికి రాజీనామానిచ్చి జస్టిసు డెమక్రెటికి పార్టీని స్థాపించి దానికి నాయకత్వము వహించిరి. ఈయన జస్టిసు పార్టీనుంచి తొలగినదిమొదలు పార్టీకి దినక్రమేణ బలముతగ్గినది. అందుపై జస్టిసు పక్షమువారు యీయనను మరల నాయకత్వమును వహించి పార్టీని బలపరచవలయునని అడుగుకొన్నందుపై అందుకు కొన్ని కండిషనులను తెలియచేసిరి. పార్టీ ఏకమవుటకు ప్రయత్నము పూర్తియగు సమయములో 8-1-35 తేదిన దేహమునకు జబ్బుచేసి 6 రోజులు