పుట:Madrasu Government Yokka Pradhana Manthiriga Undina Sriyutha Gourava Deewan Bahadur Bollini Manuswamy Nayudu Gariokka Jeevitha Charitramu.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

7. అందరిని సమానభావముతో చూచువారు. మహరాజు, బీదవాడు, పెద్దవారు, చిన్నవారు, గొప్పజాతివారు, తక్కువజాతివారు, గొప్ప ఉద్యోగస్థుడు, చిన్న ఉద్యోగస్థుడు, జవాను అని భేదమెంచువారుకారు. కోపమేలేదు. శాంతమూర్తి. సాధ్యమైనంతవరకు యితరులకు ఉపకారము చేయును. అపకారముచేయడు. ఇందుకు నిదర్శనము ఆయన యొక్క ముఖారవిందమే.

8. 1930 సం||రములో జస్టిసు కక్షిలో నాయకత్వము వహించిరి. అప్పటిలో ఆ కక్షివారికి బ్రాహ్మణులపై ద్వేష మెక్కువగా నుండెను. ద్వేషము చేతనే పనిని కాదనిజెప్పి శాంతముతోను ప్రేమతోను అన్నిపనులు సాధించవచ్చునని జస్టిసుకక్షిలో బ్రాహ్మణలనుకూడ చేర్చుకోవచ్చునని తీర్మానమును ప్యాసుచేయుటకు నెల్లూరులో జరిగిన బ్రాహ్మణేతర మహాసభలో చాలా పోరాడిరి. అప్పటిలో అరవదేశములో నుంచివచ్చిన ప్రముఖులలో కొందరు ఆక్షేపించిరి. పిదప వీర్లే మ.రా.రా.శ్రీ నాయుడుగారు చెప్పిన మేరకు బ్రాహ్మణులనుకూడా చేర్చుకోవలయుననే తీర్మానమును ప్యాసుచేసిరి. అన్నిజాతులవారికిన్ని నాయుడుగారియందు నమ్మకము విశ్వాసముగలదు. మహాత్మా గాంధిగారియొక్క వుత్తరవులను తనవల్ల సాధ్యమైనంతవరకు నిశ్చయముగా ధృడచిత్తముతో నవలంబించువారు.

9. 27-10-1930 మదరాసు గవర్మెంటుకు ప్రధాన మంత్రిగా నేమింపబడిరి. మంత్రి పదవికివచ్చిన తరువాత