పుట:Madhavanidanamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈవ్యాఖ్యయందు భ్రమప్రమాదాదులచే నెచ్చటనైన లోపమున్నచో పండితవరేణ్యులు నాకు దెల్పి నావలననే సవరింపజేయప్రార్ధించెద.

ఇదివరలో చరకసంహిత - వాగ్భటము - గదనిగ్రహము - రావణకుమారతంత్రము - భేషజకల్పము - చక్రదత్త - శార్జ్గధరకృతత్రిశతి - రాజమార్తాండము - విషవైద్ యచింతామణి - శార్జ్గధర సంహిత - బసవరాజీయము - వైద్యశతశ్లోకి - రసప్రదీపిక - నాడీజ్ఞానము - వస్తుగుణమహోదధి - చారుచర్య - ఇలాజుల్ గుర్బా - సుశ్రుతము - వైద్యచింతామణి మున్నగు వైద్యగ్రంధముల శ్రీవావిళ్లవారు ప్రకటించి యున్నారు:

మరియు ననేకసంస్కృతాంధ్ర గ్రంధముల ముద్రించి లోకమునకు ప్రచారమొనరించి సారస్వతమునెల్ల నుద్ధరింప బద్ధదీక్షులగు శ్రీ వావిళ్ల వేంకటేశ్వశాస్త్రిగారికి ఆయు రారోగ్యభాగ్యముల నొన గూర్చి తగు ప్రొత్సాహమును పరమకారుణికుండగు శ్రీయ:పతి గలిగించుగాక!

ఇట్లు విన్నవించు, పండితపాదసేవకుడు, పండిత నుదురుపాటి విశ్వనాధశాస్త్రి, వ్యాఖ్యానకర్త


  • శ్రీకుదురుపాటి విశ్వనాధశాస్త్రి గారు సుశ్రుతసంహిత పూర్తియగుటకు పూర్వమే మరణించి నందులకు విచారపడు చున్నాము.

ఇట్లు

ప్రకాశకులు