పుట:Madhavanidanamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాతాదిపరస్పర సంసర్గభేదముచేత పండ్రెండుగ నేర్పడును. వానిలో వాతపిత్తములు రెండును అధికముగ ప్రకోపమునొంది కఫము వానికన్న తక్కువగ నుండునపుడు కలిగిన జ్వరము తిరుగుచున్న చక్రముపై నుండువానివలె ఒడలు తిరుగునట్లుండును, దప్పి యధికమగును. శరీరమనస్సులకు తాప మధికమగును. తల మిక్కిలి బరువై యోరువరాని నొప్పి కలుగును.

2.వాతశ్లేష్మములు రెండు నధికమై పిత్తము తక్కువగా నుండునపుడు చలి వచ్చును. దగ్గు,అరోచనము, కునికిపాటు, అధికమైనదప్పి, సంతాపము, రొమ్మునొప్పి ఈ లక్షణములు కలుగును.

3.వాతము తక్కువయై పిత్తకఫములు రెండును ఎక్కువగా నుండు జ్వరమును దధికముగ వాంతియగును. చలి, జ్వరము ఈ రెండును మార్చి మార్చి పలుమారు వచ్చుచుండును. దప్పి యధికమగును. చిత్తభ్రమము కలుగును. ఎముకలయందు నొప్పి పోట్లు మున్నగుబాధలు కలుగును.

4. వాతమధికమై పిత్తకఫములు రెండును తక్కువగా నుండు జ్వరమున కీళ్లయందును, అస్థులయందును, శిరస్సునందును నొప్పికలుగును. సంబంధము లేక మాటలాడును. శరీరము బరువుగా నుండును. శరీరము తిరుగునట్లుండును. దప్పి యధికమగును. నోరు, కంఠము, పెదవులు చెమ్మలేన యుండును.

5. పిత్తమధికమని వాతకఫములు రెండును తగ్గియున్న జ్వరమునందు మలమూత్రములు ఎఱ్ఱనగును, శరీరతాపం బధికమగును. అధికముగ చెమట వెడలును. దప్పియు నధికమగును, శరీరబలము నశించును. మూర్చ కలుగును.

6. కఫమధికమయి వాతపిత్తములు తగ్గియున్న జ్వరమున పనులయందు ఉత్సాహము తగ్గును. ఆరోచకము, ఓకిరింతలు అధికమైనతాపము, వాంతి, అన్ని విషయములయం దిచ్చలేకయుండుట, మతిభ్రమము, మైకము, దగ్గు ఇవి యన్నియు కలుగును.

7. వాతము హీనమై పిత్తము మధ్యమమై, కఫం అధికమైయున్న జ్వరమున, ప్రబలమైన పడిసెముపట్టును. వాంతి యధికమగును. పనులయందు దుత్సాహము లేకుండును. మైగ్రమ్మును ఆరోచనకము గల్గును. జఠరాగ్ని మందగించును.

8. వాతము హీనమై కఫము మధ్యమమై పిత్తమధికమైయుండు జ్వరమున, మలమూత్రనేత్రములు పసుపురంగు కలిగియుండును. తాపంబును దప్పియు నధికమగును. చిత్తభ్రమము కలుగును. ఆహారపదార్ధములయందు రుచి తప్పిపోవును.

9. పిత్తము హీనమై కఫము మధ్యమమై వాతం బుత్కటముగ నున్న జ్వరము అధికముగ తలనొచ్చును, శరీరము వడకును. శ్వాసం బధిమమగును. భ్రమ మాటలు మాటలాడును. వాంతియు వరోచకంబును కలుగును.