పుట:Madhavanidanamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వికారముగ నవ్వుచుండుట, మామూలు పద్ధతి నుండక విరుద్ధమైన్ చెష్టలు చేయుచుండుట, ఈలక్షణము లధికముగా వాగ్భటమున జెప్పబడియె. పైలక్షణము లన్నియు త్రిదోషములు స్వప్రమాణమునకన్న నధికముగా వృద్ధినొంది ప్రకుపితములైన త్రిదోషములచే గలిగిన్ సన్నిపాతజ్వరమునందు కల్గు నని చరకాచార్యుడు నిర్ణయించెను.

మరియు సన్నిపాతజ్వరములయందు త్రిదోషములు ప్రకోపమునొందుట సాజము. అందు ఒక్కదోషమైనను, లేక రెండుదోషములైనను అధికముగా ప్రకోపించిన సన్నిపాతజ్వరములయందు కొన్నిలక్షణములు వెశేషములుగ గానబడును. దాన గల్గు సన్నిపాతజ్వరభేదములు పదిరెండువిధములై యుండును. వాని లక్షణములను చరకాచార్యులు విపులముగ నిట్లు వివరించిరి:-- "భ్రమ: పిపాసాదాహశ్చ గౌరవం శిరసోం తిరున్, వాతపిత్తోల్బణే విద్యాలింగం మందకఫే జ్వరే. శైత్యం కాసోంరుచిస్తంద్రాపిపాసా దాహహృద్వ్యధా:, వాతశ్లేష్మోల్బణే వ్యాధౌ లింగం పిత్తానరే విదు:. చర్దిశ్శైత్యమ్ముహుర్ధాహస్తృష్ణా మోహోంస్థివేదనా, మందవాతే వ్యస్యస్థి శిరసాం శూలం ప్రలాపో గౌరవం భ్రమ: వాతోల్బణే స్వాద్ద్వ్యనుగీ తృష్ణా కంఠాస్యశుష్కతా. గస్తినిణ్మూత్రతా దాహ: స్వేద స్తృష్ణా బలక్షయ;, మూర్చానేతి త్రిబోషే స్యాల్లిన్గంపిత్తే గరీయసి. ఆలస్యాదుచిహ్నహృల్లాసణాహపమ్యరతిభ్రమై:, కఫోల్బణ. సన్నిపాతం తన్ద్రా కాసేన చాదిశేత్. ప్రలిశ్యాచ్చర్ద్ల్హిరాలస్యం తన్ధ్రాంగుచ్యగ్నిమార్ధవం, హీనవాతే పిత్తమధ్యే లింగం శ్లేష్మాధిరే మతమ్; హారిద్రమూత్ర నేత్రత్వం దాహస్తృష్ణాభ్రమోందుచి:, హీనవాతే మధ్యకఫే లింగం పిత్తాదికేతం. శిరోరుగ్వేవధుశ్శ్వాసప్రలాపచ్చర్ధ్యరోచకా:, హీనపిత్తే మధ్యకఫేనిల్గంవాతాధికే మతం. శీతతా గౌరవం తన్ధ్రా ప్రజాపోంస్థిశిరోంతిరుశో, హీనపిత్తే వాతమధ్యే లింజ్గం శ్లేష్ణాధిరే విదు:. నర్చోభేదోంగ్నిదౌర్బల్య: వృష్ణాదాహోంరు చిర్బ్రమ:, కఫహీనే వాతమధ్యే లిజ్గం పిత్తాధిరేవిధు:, శ్వాస కాస: ప్రతిశ్యాయ: ముఖశోషోంతిపార్శ్యరుక్, పఫహీనేపిత్తమధ్యే లిజ్గం వాతాధికే మతం." (చ.చి.అ.3.శ్లో.91--002)

1.త్రిదోషములు ప్రకుపితములై సన్నిపాతజ్వరము కల్గునని పైజెప్పబడినది. అందు దోషత్రయములో న్యూనాధికముగకూడ నొకసమయమున ప్రకోపము నొందును. అం దొకదోషము అధికముగను, తక్కినరెండును దానికన్న తక్కువగను ప్రకోపము నొందినయెడల వికోల్బణ మనియు, రెండుదోషములు అధికముగ ప్రకోపించినపుడు ద్యుర్బల్భణ మనియు ప్రాచీనాచార్యులు నిర్ణయించిరి. అయ్యది