పుట:Madhavanidanamu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాతపిత్తకఫములు మూడును ప్రకోపించిన సన్నిపాతజ్వరమున క్షణకాలము జ్వరతాపము క్షనకాలమున చలి గల్గును మాటిమాటికి కొకటిమార్చి యొకటి కల్గుచుండును. ఎముకలయందును, కీళ్ళయందును, శిరస్సునందును నొప్పికల్గును. కన్నులు కలకబారి యెఱ్ఱనై నీరు చొటచొట గారుచు లోనికి బోయియుండును. చెవుల యందూపూర్వమైన మ్రోతకల్గి పోటు పుట్టును. కుత్తుకయందు ముండ్లు గ్రుచ్చినట్లు నసనసలాడుచుండును. కునికిపాటును, చిత్తభ్రమంబును కల్గి యసంబద్ధములుగ తన కిచ్చివచ్చినతెరంగున మాటలాడును. దగ్గు, శ్వాసము, అరుచియు కల్గును. చక్రముపై నుండువానివలె గిరగిరదిరుగున ట్లుండును. నాలుక కాలిన చందమున చెమ్మలేక నల్లనై టేకాకుచందమున పశ్వాదుల నాలుక బోలి కరకరలాడుచుండును. అవయములన్నియు సడలి బిగిచెడి జారునట్లుండును. కఫము రక్తమును కలిసిన పిత్తపసరు నోటనుమియువపుడెల్ల వెడలుచుండును. పరుందియున్నను శిరస్సును నానావిధముల ద్రిప్పుచుండును. నీళ్ళు త్రాగుచున్నను దప్పి యణంగక వృద్ధియగుచుండును. నిదురపట్టదు. రొమ్ములో నొకవిధమైన నొప్పి పుట్టును. చెమటయు మూత్రపురీషంబులును బైట వెలువడవు. ఒకవేళ వెలువడినను చాలకాలమునకు కొంచెముకొంచెముగ వెడలును. శరీరమంతయు కొంచెముగ కృశించియుండును. కుత్తుకయందు బిగ్గరగ మూల్గుచుండును. నల్లనిరంగుతో కలసిన రక్తవర్ణంబులైన పొక్కులును కల్గును. మాట హీనస్వరమై మెలమెల్లగ మాటలాడును. ఒకసమయమున ఓపికలేక మూగవానివలె నేమియుం బలుకనేరకుండును. నాసారంధ్రములు చెవులు నొరు కన్నులు మున్నగు స్రోతస్సులు పుండగును. కడుపు మిక్కిలి స్థూలమై బరుగ నుండును. వారాదిదోషములు చిరకాలమునకు పరిపాకమునంది యధా పూర్వముగ నుండును. ఇట్టి లక్షణములన్నియు కల్గినది సన్నిపాతజ్వర మని యెరుంగునది.

పైజెప్పినది సన్నిపాతజ్వరమునకు సామాన్యలక్షణములు. వాగ్భటాచార్యుడు కొన్ని లక్షణముల నధికముగా చెప్పియున్నాడు. ఎట్టు లన:-- "తద్వన్బీతం మహానిద్రాదినా జాగరణం నిశి, సదా వానైన నానిద్రా మహాంవేదోంతి నైన వా. గీతనర్తనహాస్యాది వికృతేహాప్రవర్తనమ్" (అ.హృ.ని.అ.2) చలి యధికముగా గలుగుట పగటిపూట ఆపుటకు సాధ్యముగాక గాధముగ నిదురవచ్చుట, రాత్రి పూట ఎంతప్రయత్నపడినను ఇంచుకైనను నిదురపట్టకుండుట, రాత్రిపగలు అని నియమములెక నిరంతరముగ నిదువవచ్చుట లేక్ నిదుర బొత్తుగ్ రాకుండుట, శరీరమున చెమట అధికముగ పట్టుట, లేక కొంచెమైనను చెంటపట్టకుండుట, సంబంధము లేక తన కిచ్చవచ్చినట్లు సంగీతము పాడుచు నాట్యమాడుచు .