పుట:Madhavanidanamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంచున దడిసిన రీతిగ మొద్దుబారియుండుట, సర్వభేదము (కీళ్లల్నొప్పి), నిదుర అకాలమునందు నధికముగ వచ్చుట, శరీరము బరువుగ నుండుట, తల బరువై దిమ్మపట్టియుండుట, పడిసముచే నాసారంధ్రములు బిగిసియుండుట, దగ్గు, చెమ్మట, పట్టకుండుట, శరీరమునందెల్ల మంట, జ్వరవేగము తీవ్రముగాక మధ్యముగ నుండుట ఇవియన్నియు వాత కఫజ్వరమున కల్గును.

పిత్తకఫజ్వరలక్షణము

లిప్తతిక్తాస్యతా తన్ద్రా మోహ: కాసో-రుచి స్తృషా,
ముహుర్దాహో ముహుశ్శీతం పిత్తశ్లేష్మజ్వరాకృతి:, 17

కఫము గ్రమ్మియుండుటంజేసి నోరు జిగటగల్గి పూయబడినట్లుండుట, చేదు గల్గియుండుట, మైకము గ్రమ్ముట, చిత్తభ్రమము గల్గుట, దగ్గు, అరోచకము, దప్పి జ్వర సంతాపంబును చలియును మార్చిమార్చి మాటిమాటికి వచ్చుట ఇవియన్నియు పిత్తకఫముల ప్రకోపమున కల్గిన జ్వరమున సంభవించును.

మరియు:--జడత, చెమట అధికమగ వెడలుట, నోట కఫంబును పిత్తపస్రును వెడలుట మున్నగులక్షణములు చరకమున జెప్పబడినవి.

సన్నిపాతజ్వరలక్షణము

క్షణే దాహ: క్షణే శీతమస్థిసన్ధిశిరోరుజా,
సాస్తావే కలుషే రక్తే నిర్భుగ్నే చాపి లోచనే. 18
సస్వనౌ సరంజౌ కర్ణౌ కణ్ఠశ్శూకైరినావృత:,
తన్ధ్రా మోహ: ప్రలాపశ్చ కావశ్శ్వాసోంరుచిర్భ్రము, 19
పరిదగ్ధాఖరస్పర్శా జిహ్వా ప్రస్తాజ్గతా పరమ్,
ష్ఠీవనం రక్తపిత్తస్య కఫేరోన్మిశ్రితస్యచ, 20
శిరసోలోకనం తృష్ణా నిద్రానాశో వ్యాది వ్యధా,
న్వేదమూత్రపురీషాణాం చిరాద్ధర్శనమల్పశ:, 21
కృశత్వం నాతిగాత్రాణాం ప్రతతం కణ్ర్హకూజనం,
కోఠానాం శ్వావరక్తానాం మణ్డలానాం చ దర్శనమ్, 22
మూకత్వం స్రోతసాం పాకో గురుత్వముదగస్య చ,
చిరాత్పాకశ్చ దోషాణాం సన్ని పాతజ్వరాకృతి:, 23