పుట:Madhavanidanamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నవి. నిదానకర్తయగు మాధవకరుడు "శ్రీమాధవేనేందుకరాత్మ జేన" అని తన గ్రంధముననే తాను ఇందుకరుని పుత్రుడని స్ఫుటముగ దెలిపియున్నాడు. కావున నీమాధవకరుడు వేదభాష్యకర్తయగు మాధవాచార్యులకు భిన్నుడనునంశము నిర్వివాదము. మరియు ఉత్తర హిందూస్థానమున నామాంతమునందు "కర్" అని చేర్చుట ప్ర్రాయికముగ నలవాటులోనున్నది. వీరితండ్రి పేరు 'ఇందుకర ' అనియు, వీరి పేరు 'మాధవకర ' అనియు "కర" శబ్ధము నామాంతమున నుండుటంబట్టిచూడ నౌత్తరాహుడనిమాత్ర మూహింపదగియున్నది.

అట్టి యీమాధవనిదానమునకు అనేకులు సంస్కృతవ్యాఖ్యానములు రచించిరి. అందు శ్రీవిజయరక్షితవిరచిత మధుకోశం బను వ్యాఖ్యయు, వాచస్పతి వైద్యవిరచిత ఆతంకదర్పణవ్యాఖ్యము సుప్రసిద్దముగ గానంబడుచున్నవి. ఈవ్యాఖ్యానములచేత సంస్కృత భాషాభిజ్ఞులకు దెలియుట కష్టసాధ్యము.

అట్టిలోపమును నినర్తిపరచుటకై నేను ఆంధ్రలోకమునకు సుబోధమగునట్లు తేటతెల్లమగు నాంధ్రభాషచే నీవ్యాఖ్యానమును రచించినాడ. ఇయ్యది మధుకోశ అతంక - దర్పణముల ప్రాయకముగ ననుకరించియుండును. సందర్భానుసారముగ చరక-సుశ్రుత-వాగ్భటాది వాక్యముల ననువదింది పరస్పరభేదముల నిరూపించుచు వివరింపబడినది. ఇది యాంధ్రలొకమునకు చాలగ నుపకరించు నని నాయుద్దేశము.

నేనీవ్యాఖ్య రచించుటకు ఆంధ్రభాషాభిమానులును, గ్రంధోద్ధారకులును, దిగంతరవ్యాప్తకీర్తిమంతులును, పరొపకారపరాయణులును, శ్రీవావిళ్ల రామస్వామిశాస్త్రిసుపుత్రులును నగు బ్రహ్మశ్రీ శ్రీయుత వేంకటేశ్వరశాస్త్రులుగారు నాకు పారితోషికము మున్నగు తగువసతులు గల్పించి ప్రోత్సహించుటయేగాక ముద్రణాదివ్యయ ప్రయాసముల సరకు సేయక ముద్రించి లోకోపకార మొనరించుటయే