పుట:Madhavanidanamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యభిప్రాయముచేతనే తరుణ (ఆరంభదశయందు) జ్వరమున నగ్నిదీప్తి కలిగి పాచనము గల్గుటాకై కట్వమ్లలవణములు పాచకములైనను పిత్తెరక్తము లగుటంజేసి వానిని విడిచి పిత్తహరమగు తిక్తరసమునే ప్రధానముగ చరకాచార్యులు నిర్దేశించెను.

మఱియు "జ్వరస్తు పూజనైవొపకామ్యతి" అని విజీహుడు చెప్పియుండుటచే జ్వరము రుద్రకోపసంభవమగుటంజేసి దైవస్వరూపముగ భావించి పూజన సల్పినచో శీఘ్రముగ శమించు ననియు విదేహప్రభృల్తులు నుడివిరి. *జ్వరము మూడు పాదములను, మూడు శిరంబులును, ఆరు భుజంబలును, తొంబదికన్నులును కల్గి, ధర్మమును ఆయుధముగ ధరించి, లయకాలరుద్రుని యమునిబోలె క్రూరారమై యుండునని హరివంశమున బేర్కొనంబడియున్నది. ఈశ్వరునకు బాణాసురునకు యుద్ధము జరుగు నవరసమున నీశ్వరకోపజనిత మగు జ్వరము యుద్దం బొనర్చినట్టులు "మహేశ్వరో వైష్ణవశ్చ యుయుధాతే జ్వరావుభౌ," అని భాగవతమున నున్నది. ఇవి మున్నగువాక్యములచే జ్వరము దేవతాత్మక మనియు, రూపవంతమనియు స్ఫుటామగ దేలుచున్నది.

జ్వరసంప్రాప్తి

మిధ్యాహారవిహారాభ్యాం దోషాహ్యామాశయాశ్రయా:,
బహిర్నిరస్య కోష్ఠాగ్నిం జ్వరదాస్ప్యూ రసానుగా:. 2

జాంగరాదిదేశము, రాత్రి పగలు మున్నగుకాలము, దేహప్రకృతి, శరీరము యొక్కయు జాఠరాగ్నియొక్కయు బలము, వయస్సు మున్నగువాని ననుసరించి, యాహారవిహారాదులు చరకమునందలి స్వస్థవృత్తప్రకరణమున ఋతుచర్యాధ్యాయము, అన్నపానరక్షాధ్యాయము మున్నగు చోట్ల వివరింపబడియున్నవి. అట్టినియమమునకు విరుద్దములగు నాహారవిహారాదులు మిధ్యాహారాదు లనబడును. అట్టి మిధ్యాహార విహారాదులచే వాతపిత్తకఫములు ప్రకోపమునంది యామాశయమున జేరి కోష్ఠాగ్నిని బయటద్రోసి రసధాతువుతో గలిసి జ్వరమును గల్గించును. దోషప్రకోపముచే బయలువెడలిన జాఠరానలాష్మము శరీరముపై వ్యాపించి జ్వరరూపముగ పరిణమించును. అట్టి యగ్నిసంబంధముచేత శరీరమునసింతేట వేడి యధికమగును. జాఠరానలము వెలువడటంజేసి భుజింపబడిన యాహారపదార్ధము జీర్ణింపదు. 'రసానుగ:' అనుటచేత రసధాతు;వు (ఆహారము జీర్ణించినపిదప దాని సారరూపమైన మొదటిధాతువు)ను చెరతి జ్వరమును గల్గించు నని భావము


  • "త్రిపాధ్భస్మప్రహరణ స్త్రీశిరారక్తలోచన:, సమేప్రతిసుఖ:, విద్యాత్సర్వా మయతిర్జ్వర:" అను మంత్ర మీవిషయమును స్ఫుటపతచును.