పుట:Madhavanidanamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జ్వరముయొక్క ప్రాగుత్పత్తియు, భేదంబులును

ద్రాక్షాసమానసంక్రుద్ధరుద్రనిశ్వాసంభవ:,
జ్వరోంష్టధా పృధగ్ద్వంద్వసంఘాతాగంతుజస్స్మృత:.

దక్షప్రజాపతిచేసిన యవమానముచేత కోపోద్దీపితు డగు రుద్రునియొక్క క్రూరమైన నిట్టూరుపువలన జ్వరము మొట్టమొదట పుట్టినది. అయ్యది మిధ్యాహార విహారములంజేసి ప్రకోపమునొందిన వాతపిత్తశ్లేష్మములలో నొక్కొక్కదానిచేతను రెండేసిదోషములచేతను, దోషములనన్నింటిచేతను, అభిఘాతము మున్నగు నాగంతు కారణములచేతను జనించుటంజేసి యెనిమిది తరంగు లగును. అందు వాతప్రకోపమున జనించినజ్వరము వాతిక మనియు, పిత్తము జనించినది పైత్తిక మనియు, కఫమున జనించినది శ్లైష్మిక మనియు, వాతపిత్తముల రెండింటిచే గల్గినది వాతపిత్తజ్వరమనియు, త్రిదోషములు నొక్కుమ్మడి ప్రకోపించుటచే గల్గినది సాన్నిపాతిక మనియు, ఆయుధములు మున్నగుగాని దెబ్బచే గల్గినది యాగ్ంతు కారణముల జనించుటంజేసి యాగంతుజ మనియు నెనిమిది భేదముల నెరుంగునది.

ఇచ్చట దక్షప్రజాపతి యీశ్వరుని పిలువకయే యాగము సేయంబూన నప్పరమేశ్వరుం డట్టియవమానమున ప్రకోపమునంది దక్షునియాగమును ద్వంసము చేసినపు డుద్భవించిన రుద్రకోపము జ్వరరూపముగ పరిణమించిన దను పౌరాణిక గాధ ననుసంధించునది.

రుద్రకొపము జ్వరమునకు మొట్టమొదట పుట్టుటకు కారణమగుటం జేసి అది విప్రకృష్టకారణము. వాతారిదోషములు తాత్కాలికజ్వరమునకు కారణములుగాన సన్నికృష్టకారణములు. రుద్రకోపనున జనించుటంజేసి జ్వరము కేవలము తేజోరూపము. "పిత్తమగ్నిరితి స్మృత:" అని యుండంటంజేసి పిత్తము ఆగ్నేయముగాన జ్వరము లన్నిటియందును ప్రధానముగ నుందును. కావున జ్వరసామాన్యముగ చికిత్సజేయుతరి పిత్తములు ప్రకోపింపజేయక యితరదోషముల హరించు చికిత్సజేయుట సమంజసము. ఈవిషయమును వాగ్భటాచార్యుడు "ఊష్మా పిత్తాదృతే పాస్తిజ్వరో నాస్మ్యాష్మణావినా, తస్మాత్పిత్తాదిరుద్దాని త్యజేత్పిత్తాధికేంధికం." (అ.హృ.చి.ఆ.1) అని చెప్పెను. పిత్తప్రకోపములేక వేడికలుగబోదు. వేడిలేక జ్వరము జనించుట లేదు. కావున పిత్తమునకు విరుద్ధములగు నౌషధాదులను జ్వరసామాన్యమున విడువవలె ననియు, అందును పిత్తాధికజ్వరమునందు విశేషముగ విడువవలెననియు భావము. ఈ