పుట:Madhavanidanamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీమాధవేనేనుద్ధకరాత్మజేన" అని గ్రంధాంతమునను స్పష్టముగ జెప్పెను ఇందు చరక-సుశ్రుత-విదేహ-వాగ్భటాదితంత్రములయందలి వచనములున్నను వాగ్భటవచనములే విశేషముగ గనపట్టుచున్నవి.

ఈగ్రంధమున నధ్యాయములకు బదులుగ నాయారోగముల పేరిట జ్వరనిదానము, అతిసారనిదానము మున్నగు సాంకేతికపదములచేతనే ఆయాప్రకరణములు విభజింపబడినవి. అందు మొదటి ప్రకరణము పంచనిదాసలక్షణము. ఇందు నిదానపదవాచ్యములగు నిదాన-పూర్వ-రూప-రూప-ఉపశయ-సంప్రాప్తు లైదింటిని వేరువేరు లక్షణములు వివరింపబడినవి. ఈ నిదానాదిపంచకమును జ్వరాదితోగము లన్నిటియందును రోగముల గుర్తింప సాధనములై సామాన్యముగ నుండును కావున వ్యాపకమైనది. కావుననే వాగ్భటాచార్యులు "అధాత స్పర్యరోగనిదానం వ్యాఖ్యాస్వామ:" అని యుపక్రమించి తొలుత పంచనిదాన లక్షణముల వివరించెను. చరకాదులును రోగసామాన్యముగ నుండు నిదానాది పంచకమును తొలుత వివరించి తక్కినరోగముల వరుసగ వివరించిరి.

ఈగ్రంధకర్తయగు మాధవకరునికాలము నివాసస్థలము మున్నగు చారిత్రకవిషయములును చర్చించి నిర్ణయించుటా చరిత్రకారుల పని యని తలంచి యట్టివిచారము మానితిని. అయినను ఈమాధవకరుడు వేదములకు భష్యములరచించిన విద్యారణ్యాపరనామకమాధవాచార్యులకన్న నితరందని చరిత్రకారుల విమర్శనలచే నిర్ణయింపదగియున్నది. మరియు మాధవాచార్యుల నుద్దేశించి పరాశరమాధవీయము పీఠికయందిట్లు చెప్పబడినది. "యస్య బోధాయనం సూత్రం శాఖా యస్య చ యాజుషీ, భారద్వాజకులం యస్య సర్వజ్ఞ స్సహి మాధవ:. శ్రీమతీ యస్యజననీ సుకీర్తి: మాయణ: పితా, సాయణో భోగనాధశ్ప మనోబుద్ధి సహోదరౌ." ఈవాక్యములబట్టి వేదభాష్యప్రణేతయగు మాధవాచార్యులు మాయణపుత్రు డనియు నివిమున్నగు విషయములు స్ఫుటముగ దెలియు