పుట:Madhavanidanamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందు హేతువిపరీతములు:-- శీతకఫములచే జనించిన జ్వరాదిరోగములయందు శీతకఫములకు విరుద్ధములగు నుష్ణగుణముకల శుంఠి మున్నగువాని సెవించుట హేతువిపరీతౌషధము. శ్రమముచే కల్గిన జ్వరమునందు శ్రమహరులైన మాంసరసముతో గూడిన యన్నమును భుజించుట హేతువిప్రీతాన్నము. పగలు నిద్రించుటచే గల్గిన రోగమునందు రాత్రి నిదుర మేల్కాంచుటాయు, రాత్రి నిదుర మేల్కొనుటచే గల్గిన రోగమున పగలు నిదురించుటయు హేతువిపరీతములైన విహారములు. (ఇవి హేతు విపరీశములగు ఔషధ-అన్న-విహారములు.)

వ్యాధివిపరీతములు:- అతిసారమునకు చిరుబొద్దియు, విషమునకు దిరిసంబును, కుష్ఠవ్యాధికి చండ్రయు వ్యాధివిపరీతములగు ఔషధములు. (ఈ యౌషధములు దోషములను లక్ష్యపెట్టక తమ ప్రభావమువలన వ్యాధిని నివర్తింపజేయును.) అతిసారమున స్తంభనకరములగు చిరుసెనగల నుపయోగించుట, వ్యాధి విపరీతమగు నన్నము. ఉదావర్తవ్యాధియందు ముక్కుట వ్యాధివిపరీతవిహారము. (ఇవి వ్యాధి విపరీతములగు ఔషధ-అన్న-విహారములు.)

హేతువ్యాధులకు విపరీతములు:--వాతమున జనించిన శోషరోగమునందు వాతశోషముల రెంటిని హరించు గుణములుగల దశమూలములు హేతువ్యాధి విపరీతమగు నౌషధము. వాతకఫములచే జనించిన గ్రహణీరోగమునందు మజ్జిగ నుపయోగించుట హేతువ్యాధులకు విపరీతమగునాహారము. స్నిగ్ధపదార్ధముల సేవించుటచేతను, పగలు నిదురించుటచేతను, కల్గిన తంద్రయందు రాత్రి నిదుర మేల్కాంచి యుండుటహేతువ్యాధులకు రెంటికిని విపరీతమైనవిహారము. మరియు "జ్వరేచైవాతి సారే చ యవాగూస్పర్వదాహితా" అను సుశ్రుతవాక్యమునుబట్టి యవాగువు (గంజి) జ్వరమునకు హితము. అయ్యది వాతజ్వరమున నుపయోగించిన నుష్ణవీర్యముచే వాతమును, ప్రభావముచే జ్వరమును హరించును కావున నయ్యది హేతువ్యాధులు రెంటికిని విపరీతమైనయన్నము. (ఇవి హేతువ్యాధులకు రెంటికిని విపరీతములైన ఔషధ-అన్న-విహారములు.)

మాధవ---2