పుట:Madhavanidanamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ఔషధాన్నవిహారాణాం" అనుపదము దేశకాలాదుకలును ఉపలక్షణము. సుఖారహ మనుచోట వ్యాధికమనరూపమగు సుఖమును గల్గించునది యని యర్ధము. కావున జ్వరము మున్నగురోగములయందు ఒడలిమంటపుట్టియున్నపుడు చల్లనినీళ్లలో స్నానము చేయుట మున్నగునవి. తత్కాలమున మంటనణచి సుఖమునుకల్గించినను, అయ్యది వ్యాధిని వృద్ధి నొండించును కావున నది సాత్మ్య మనదగదు.

పైజెప్పిన వివరణముచేత నిట్లు నిర్ణయయింపంబడును--ఔషధ-అన్న-విహారములు, మూడును హేతువిపరీతము, వ్యాధివిపరీతము, హేతువ్యాధివిపరీతము, హేతు విపరీతార్ధకారి, వ్యాధివిపరీతార్ధకారి, హేతువ్యాధివిపరీతార్ధకారియు నని ఒక్కొకటి యారేసి విధము లగును.

పైజెప్పినరీతిగ నుపశయము పదునెనిమిదివిధముల నుండును. వానివివరణము నీ క్రింది పటమున చూచునది:--