పుట:Madhavanidanamu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంధములయందు నిదానస్థాల్నమున వివరించి చెప్పిరి; కాని నానినన్నింటి నొక్కప్రకరణముననే చెప్పక కొన్నిరోగముల నిదానస్థానమునను, కొన్నిటిని చికిత్సయందును, కొన్నిటిని ఉత్తరతంత్రము మున్నగుప్రకరణాంతరముల యందును నిరూపించి చెప్పిరి. దానంజేసి యాయాతంత్రములను సొంతముగ జదివినగాని రోగములయన్నింటి నిదానములను దెలియ వలయవలనుపడదు. అందును కొన్ని తంత్రముల నన్నింటిని పరిశీలించినగాని పూర్తిగ రోగముల నన్నింటి నిశ్చయింప వలను పడదు.

అట్టికష్టముల తొలగించుటకై మాధవకరు డను విద్యద్త్వైద్వవరుడు ఆయాతంత్రములయందు గల రోగ నిదానముల నన్నింటిని సంగ్రహించి యనేక గ్రంధముల జదువు ప్రయాసములేక ఒక గ్రంధము చేతనే నిదానముల నన్నింటిని సులభముగ తెలిసికొన వలనుపడునట్లు ఒక్కెడజేర్చి, యాగ్రంధము తనపేర వెలయునట్లు మాధవనిదాన మను నీ గ్రంధమును రచించెను. ఈవిషయమునె యీగ్రంధకారుడు కంఠోక్తిగ నిట్లు తెలిపెను "నానతంత్రవిహీనానాం భీషజామల్పమేధసాం, సుఖం విజ్ఞాతు మాతజ్కమయమేవ భవిష్యతి." ఈవాక్యముచేత ననేక తంత్రముల జదువనేరని వైద్యవరులకు అన్ని రోగములను సులభముగ నెరుంగ నీ గ్రంధము సాహాయ్యకరమగు నని స్పష్టముగ తెలిసెడి. అట్టి సౌలభ్యమును గమనించియే "నిదానే మాధవశ్శ్రేష్ట:" అని యీ గ్రంధమును బ్రాచీనులు మిక్కిలి కొనియాడిరి.

మరియు నియ్యది సంగ్రహరూపమైన గ్రంధము. చరక - సుశ్రుతాది సంహితలయందలి శ్లోకములనే గ్రంధరూపముగ రచింపబడినది. ఈ విషయమునే గ్రంధకర్త "నానామునీనాం నష్టనైరిదానీం సమాసత:.... నిబధ్యతే రోగవినిశ్చయోయమ్" అని గ్రంధోపక్రమంబునను; "సుభాషితం యత్ర యదస్తీ కిక్చిత్ తత్సర్వ మేకీకృతమత్ర యత్నాత్. వినిశ్చయే సర్వరుజాం నరాణాం