పుట:Madhavanidanamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీనికి మనువు అనేకులైన ఋషివర్యులచే నాయుర్వేద తంత్రము లనేకము నిబంధింపబడియున్నను, వానినన్నిటిని పరిశీలించి సిద్ధాంతమును దెలియంజాలని యల్పజ్ఞాను లగు వైద్యుల కీగ్రంధము రోగముల గుర్తెరింగి నిశ్చయింప సుఖబోధకముగ నుండగలదు.

ఆయుర్వేదీయ తంత్రముయందు నిచానభాగములు పలుదెరంగుల నిరూపింపబడినను వనివాస్తవ్యార్ధము నరయంజాలని మందప్రజ్ఞులకు వానిసారాంశం లీగ్రంధమున తెలియనటుల రచియించుటంజెసి పూర్వగ్రంధములదే చరితార్ధము గాక యియ్యది సఫలంబగు ననియు, రోగపరిజ్ఞూనము ప్రయోజన మనియు నీశ్లోకమున నిరూపించ బడినది. పైరెండు శ్లోకములచే విషయము, అధికారి, ప్రయోజనము అను ననుబంధ చతుష్టయము నిరూపింపబడె నని యెరుంగునది.

వ్యాధినిదెలుపు నుపాయములు

నిదానం పూర్వరూపాణి రూపాణ్యుపశయ స్తధా, సమస్ప్రూప్తిశ్చేతి విజ్ఞూనం రోగాణాం పఞ్చధాస్మృతం.

సకలరోగముల దెలిసికొనుటకు నైదుపాయములు గలవు. అయ్యవి నిదానము, పూర్ఫరూపలు, రూపములు, ఉపశయము, సంప్రాప్తి యని పేర్కొనబడును. ఈయైదింటికి లక్షణము లీ క్రింద వివరింపబడుగాన నీయైదిటిచే రొగం బియ్యది యని గుర్తించి నిర్ణయింప నగు నని భావము.

అందు నిదానాదు లన్నిటిదేనైనను, ప్రత్యేకముగనైనను వ్యాధుల నెరుంగునది. వీనిలో నొకదానిచేతనే రోగమును నిర్ణయింపదగియున్నను వానికి వేరువేరుగ ప్రయోజన ముండుటంజేసి నుడువంబడియ. "సంక్షేపత: క్రియాయోగొ నిదానపరివర్జినమ్" అను సుశ్రుత వాక్యముచే నిదానమువర్జించి మనుటయే సంగ్రహరూపమైన ప్రధాన చికిత్సయని తెలియుచున్నది. నిదానమన రోగములకల్గించు మిధ్యాహారవిహరాదులు. ఏరోగముల కెట్టి మిధ్యాహార విహారాదులు కారణముగా జెప్పబడియున్నదో అట్టి మిధ్యాహార విహారాదులజేయక విడిచియుండునెడ నావ్యాధులు తలసూపవుగాని వానిని తొలుతనే సేవింపకుండుట ముఖ్యమైనచికిత్స యని సుశ్రుతాభిప్రాయము. ఈవ్యాధి కిది నిదాన మని తెలిసినందుకు వానిని వానిని వర్జించుటయే ముఖ్యమైన ప్రయోజనము. "నిశ్చిక్య దీయతే (ప్రతిపాద్యతే) వ్యాధిరనేనేతి నిదానం" అను వ్యుత్పత్తిచేనైనను, "నిర్ధిశ్యయితే (నిశ్చయతే) వ్యాధిరనేనేతి నిదానం" అనువ్యుత్పత్తిచేనైను వ్యాధిని నిర్ణయముగ నియ్యది యని గుర్తింప సాధకములగు విధ్యాహారవిహారాదులు నిదానశబ్దముచే వ్యవహరింపబడును.