పుట:Madhavanidanamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప జ్ఞ్చ ల క్ష ణ ని దా న మ్

అనుబంధచతుష్టయము

నానామునీనాం వచనైరిదానీం సమాసతస్సద్భిషజాం నియోగాత్, సోపద్రవారిష్టనిదానలిజ్గోనిబధ్యతే రోగనిశ్చయ్రోయం.

పడితులగు వైధ్యవరులు నా కానతినొసంగుటు జేసి, మనవశీలులై త్రికాలజ్ఞాన సంపన్నులగు చరకాది మహర్షుల వాక్యములను సాధనములుగ జేసికొని, ఉపద్రవములు (ఒక వ్యాధి ప్రధానముగ జనించినపిదప నప్రధానముగ గల్గు నితరవ్యాధులు), అరిష్టములు (మరణకాలమును నియతముగ సూచించు లక్షణములు) నిదానములు (వ్యాధులు జనించుటకు హేతువులగు మిధ్యాహారవిహారాదులు), లింగములు (వ్యాధి యియ్యది యని తెలియజేయు పూర్వరూపాదులు) అను నీనాల్గవిషయములతోగూడిన రోగ వినిశ్చయమును (రోగముల నిర్ణయమును దెలుపునట్టి గ్రంధము) రచియించెద.

ఇచ్చట "నానామునీనాం వచదైకి" అనువాక్యముచేత ప్రాచీనులగు మునిపుంగవులగ్రంధములయందలి వాక్యములను ప్రమాణముగ దీసికొనుటంజేసి తనగ్రంధము మిక్కిలి ప్రామాణికమనియు: "సమాసత: అనుటచే మందప్రజ్ఞులై గ్రంధవిస్తరమునకు భయంపడు నలనులకుంగూడ నీగ్రంధము సుబోధులుగ నుండు ననియు నీగ్రంధమునకు తక్కిన గ్రంధములకన్న ప్రాశస్త్యంబును, అభిరుచియు బోధికములు. "సద్భిషజాం నియోత్." అనువాక్యముచేత గొప్పపండితుల ప్రోత్సాహముచే నీగ్రంధము రచింపబడినదిగాని కేవలము బాండిత్యము నుద్ఘోషిచుటకు కాదనియు; గ్రంధరచనకు పూర్వమే పండితులమదరును, బద్ధకుతూహలులై యుండుటంజేసి, గ్రంధరచన చరితార్ధ మనియు విశేషములు సూచింపబడినవి.

"లిజ్గ్యతే (జ్ఞూయతే) అనేన వ్యాధి;." అనువ్యుత్పత్తిచెత వ్యాధిని దెలుపునట్టి సాధనములగు పూర్వరూప - రూప - ఉపశయ - సంప్రాప్తులు నాల్గును లిజ్గశబ్దముచే గ్రహింపబడును. ఈశ్లోకముచేత ఉపద్రవములు అరిష్టములు, నిదానములు, లింగములు అనునవి యీ గ్రంధమున ప్రతిపాదింప బడు విషయము లనియు, వీని కీగ్రంధంకు ప్రతి పాదకమగుటంజేసి విషయ గ్రంధములకు ప్రతిపాధ్యప్రతి పాదకభావసంబంధ మనియు, విషయము, సంబంధ మని నీరెండును దెలుపబడియె.

గ్రంధప్రాశస్త్యము

 నానాతస్త్రవిహీనానాం భిష్జాదుల్పమేధసామ్,
సుఖం విజ్ఞాతుమాతజ్కమయమేవ భవిష్యతి.