పుట:Madhavanidanamu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాయా వ్యాధులయం దుపయోగించు చికిత్సావిధానాదుల వివరించు భాగము ఔషధస్కంధము. ఈ స్కంధత్రయమును వివరించుగ్రంధము ఆయుర్వేద మని యార్షసిద్ధాంతము.

అందు వ్యాధి హేతువులను వివరించుభాగమును నిదానశబ్దముచే వ్యవహరించిరి, మరియు, "నితరాం దీయతే (జన్యతే) కార్యం అనేనేతి--నిదానం" అను వ్యుత్పత్తిచేత వ్యాధులు గల్గించు మిత్ధ్యాహారాదు లగు కారణము లెల్ల నిదానశబ్దముచే గ్రహింపబడును. "నిశ్చిత్యదీయతే(ప్రతిపాద్యతే) వ్యాధి: అనేనేతి--నిదానమ" అను వ్యుత్పత్తిచేత" "ఈవ్యాధి యీకారణములచేత నీరీతిగ జనించి యిట్టి లక్షణముల గల్గియున్నది" అని నిర్ణయించుటకు సాధన భూతములన్నియు నిదాన శబ్ధవూచ్యము లగును. అయ్యని నిదాన . పూర్వరూప - రూప -ఉపశయ - సంప్రాప్తులగును. అట్టి నిదానదులచే వ్యాధి యియ్యది యని స్వరూపము పూర్తిగ దెలిచినను దానిసాధ్యాసధ్యపరిజ్ఞానము నెరుంగక చికిత్సజేయు వలనుపడదు; కావున అట్తినిర్ణయమునకైన వ్యాధులకు సంబందించిన స్వరూపలక్షణంబులును, ఉపద్రవంబులును, అరిష్ట (మరణసూచక) లక్షణంబులును నిదానభాగమున వివరించుట యావస్యకము; కావున నిదాన - పూర్వరూప - రూప - ఉపశయ - సంప్రాప్తులను, ఉపద్రవ - అరిష్ట - వాధిలక్షణ్ములను వివరించి చెప్పునట్టిభాగము నిదాన మని యాయుర్వేదాచార్యులయభిమతము. ఈయుద్దేశముచేతనే యీ సంగ్రహకారుడు గ్రంధారంభమున "సోపద్రవారిష్టనిదానలిజ్గోనిబధ్యతే రోగనిశ్చయోయమ్"అని ప్రతిజ్ఞ చేసెను. పరీక్షాపూర్వకముగా రోగము తొలుత నిశ్చయించియే చికిత్సచేయవలెను. ఈ విషయమునే "రోగమాదౌ - పరీక్షేత తతోనస్తరమౌషధం." (చ.సూ. అ.2.) అని చరకాచార్యు లుపదేశించిరి.

అట్టి రోగనిశ్చయరూపమైన నిదానభాగమును ఆయాతంత్ర కారులగు ఆత్రేయ-చరక-సుశ్రురాది ఋపుంగవులు వారివారిసంహితా