పుట:Madhavanidanamu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము

శ్రీ పరమకారుణికుండును పరాత్పరుండును సకల భూతాంతర్యామియు నగు నాదిదేవుని యనంతసృష్టికి లోనగుమానవులకును, ప్రాపకము లగు శ్రుతిచోదితకర్మములు ముఖ్యసాధనములు. అట్టి కర్మములే ధర్మపదవాచ్యము లగును. వానిని విధ్యుక్తముగ నెరవేర్చుటకు శరీరము ముఖ్యసాధనము. అయ్యది వ్యాధిపీడితముగాక యారోగ్యస్థితి నుండినగాని సకల క్రియాదక్షము కానోపదు. అట్టియెడ మనుజుల ప్రజ్ఞాపరాధమునంజేసి మిధ్యాహారాదులచే నారోగ్యము చెడును. అట్టి యారోగ్యము చెడకుండుటకును, నొకవేళ పొరపాటున నారోగ్యము చెడినచో దానిని మరల సరిజేసికొనుటకును సాధనముగ ప్రాచీన మహర్షులు ఆయుర్వేదమును నిర్మించిరి. అట్టి యాయుర్వేదము తొలు దొలుత బ్రహ్మవలన సహస్రాక్షు డుపదేశము నొందెను. పదంపడి వారి వలన భరద్వాజుండును, వారివలన నాత్రేయాది మహర్షులును గ్రహించి వేరువేరుగ నాయుర్వేదతంత్రములను లోకహితార్థమై రచించిరి.

అట్టి యాయుర్వేదము హేతు - లక్షణ - ఔషధరూపస్కంధ త్రయాత్మకమై యుండును. ఈ విషయమై "తస్త్రే ప్రోవాచ భగవాన్ ఆయుర్వేదం శతక్రతు:. పదైరలైపర్మతిం బుద్ధ్వా....హేతులిజ్గొషధజ్ఞానం స్వస్థాతుపరాయణం. త్రిసూత్రం.... పితామహ:" చ.సూ.ఆ. 1) అను వాక్యముచే చరకాచార్యులు చెప్పిరి. అందు జ్వరాది రోగముల యుత్పత్తికి కారణములు దెలుపుభాగము హేతుస్కంధము. వానిలక్షణముల నిర్దేశించి వివరించుభాగము లక్షణ స్కంధము. ఔషధముల స్వరూప గుణాదులను వివరింపుచు వాని