పుట:Loochupu-fr.Jojayya.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముంచియెత్తుతుంటుంది. ప్రకృతి అతన్ని కుటుంబ పోషకుణ్ణి చేయబోతుంది. కనుక అతని వ్యక్తిత్వం గూడ ఆ ధర్మానికి అనుగుణంగానే వుంటుంది. స్త్రీ వ్యక్తిత్వం వేరు, పురుషుని వ్యక్తిత్వం వేరు. లింగాన్ని బట్టి వ్యక్తిత్వం మారుతుంటుంది.

2. మన వ్యక్తితమూ ప్రాథమికావసరాలూ

నరులకు ప్రాథమికావసరాలంటూ వుంటాయి. చక్కని వ్యక్తిత్వం పెంపొందించుకోవాలంటే ఈ యవసరాలను తీర్చుకోగలిగి వుండాలి. ఈలాంటి అవసరాలు ఐదున్నాయి. అవి శారీరకరంగానికీ, విజ్ఞానరంగానికీ ఆధ్యాత్మిక రంగానికీ, మానసిక రంగానికీ, సాంఘిక రంగానికీ చెందినవి. ప్రస్తుతం వీనిలో తొలి మూడవసరాలను గూర్చి ముచ్చటిద్దాం. మిగతా రెండవసరాలు వచ్చే వ్యాసాల్లో చర్చిద్దాం.

1. శారీరకావసరాలు

చక్కని వ్యక్తిత్వం అలవరచుకోవాలంటే పటిష్టమైన దేహంకూడ వుండాలి. మన దేహం తగిన రీతిని లావుగా, ఎత్తుగా, బలంగా వుండాలి. ప్రాచీన రోమను ప్రజలు “బలమైన దేహమూ, చురుకైన మెదడూ” ఆదర్శంగా పెట్టుకున్నారు. మనం దేహారోగ్యాన్ని పెంపొందించుకుంటూం డాలి. మంచి ఆరోగ్యం ఉత్సాహాన్ని ఇస్తూంటుంది. జీవితంలో ఏదైనా సాధిద్దామనే కోరిక పుట్టిస్తుంది. అనారోగ్యం నిరాశనూ, నిస్పృహనూ తెచ్చిపెడుతుంది. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరం. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే బలవర్థకమైన ఆహారాన్ని భుజిస్తూండాలి. ఏదో రూపంలో వ్యాయామం చేస్తూండాలి. అలసిపోయినపుడు తగిన రీతిగా విశ్రాంతికూడ తీసికొంటూండాలి. నరునికి విశ్రాంతినిచ్చే సాధనాల్లో ముఖ్యమైంది నిద్ర. పెద్దవాళ్లు రోజూ కనీసం ఐదుగంటలైనా నిద్రపోవాలి. యావన ప్రాయంలో వున్నవాళ్లు ఎన్మిది గంటలూ, పిల్లలు పదిగంటలూ నిద్రించాలి. మన పూర్వులు “శరీర మాద్యం ఖలు ధర్మసాధనం" అన్నారు. అనగా ధర్మాన్ని సాధించడానికి ఉపయోగపడే పరికరాల్లో శరీరం మొట్టమొదటిదని భావం. మొదట ఈ శరీరాన్ని సంరక్షించుకోందే ఏ (6)