పుట:Loochupu-fr.Jojayya.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాక్షాత్కారం కలిగించుకుని ఈశ్వరునికి ప్రీతిపాత్రంగా జీవించాడు. ఈ భగవద్భక్తి ఆయన వ్యక్తిత్వానికి వన్నెదెచ్చింది.

2. మతం

భగవంతునితోపాటు మతం కూడా మన వ్యక్తిత్వాన్ని మలుస్తుంది. నరుడు కొన్ని ఆదేశాల ప్రకారం తన వ్యక్తిత్వాన్ని పెంపొందించు కుంటుంటాడు. ఈ యూదేశాలు చాలవరకు మతంనుండే లభిస్తాయి. శివాజీ ఓ మత సంప్రదాయానికి చెందినవాడు. గురునానక్ మరో మత సంప్రదా యానికి చెందినవాడు. ఈ సంప్రదాయాల ప్రకారం వీళ్లిద్దరూ తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నారు. కనుక మతం మనకు ఆదర్శాలను ఇస్తుంది. ఈ యాదర్మాలను బట్టి మన వ్యక్తిత్వం ఓ ప్రత్యేక రూపం దాలుస్తుంది.

3. కుటుంబం

నరుని వ్యక్తిత్వాన్ని మలచే మూడవశక్తి కుటుంబం. ఇక్కడ కుటుంబమంటే విశేషంగా రెండంశాలు : 1) వంశ పారంపర్యంగా వచ్చే లక్షణాలు 2) పరిసరాలనుబట్టి వచ్చే లక్షణాలు మొదట వంశ పారంపర్యంగా వచ్చే లక్షణాలను చూద్దాం - Heredity. ప్రసూతి వైద్యశాలకు వెళ్లామంటే చాలమంది బిడ్డలు కన్పిస్తారు. ఈ శిశువులందరూ ఒకేరకంగా వుండరు. కొంతమంది బలంగా కొంతమంది బలహీనంగా వుంటారు. కొంతమంది నల్లగా, కొంతమంది ఎర్రగా, కొంతమంది పొడవుగా, కొంతమంది కురచగా వుంటారు. కొంత మంది చైతన్యంగా, కొంతమంది మందంగా వుంటారు. ఈ భేదాలు ఎలా వచ్చాయి? తాతముత్తాల నుండీ, తల్లిదండ్రుల నుండీ వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలే ఈ వైవిధ్యాలకు కారణం. మన ముఖభంగిమలు, దేహ దార్ద్యము, ఆరోగ్యం, ఒడలి రంగు వంశపారంపర్యంగా వస్తాయి. తెలివి తేటలూ అలాగే వస్తాయి. నరేషు, సురేషు, సతీషు, ఒకే ప్రాయం వాళ్లు. మిత్రులు. ఐనా నరేషు చాలా తెలివైనవాడు. సురేషుకు మామూలు తెలివి తేటలున్నాయి. సతీషు మందకొడి. అతన్నిక మనం మార్చలేం. అది వంశ పారంపర్యంగా వచ్చిన గుణం.