పుట:Loochupu-fr.Jojayya.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొందరు అలా అంగీకరించరు. వాళ్లకు ఆ లోపాలు పెద్ద వ్యధను తెచ్చి పెడతాయి. పైగా వాళ్లు వేరేవాళ్లతో పోల్చి చూచుకొని కుమిలిపోతూంటారు. ఈలాంటి వాళ్లల్లో మాత్రమే న్యూనతా భావాలు కలుగుతాయి. 2. హైన్యభావాల లక్షణాలు హైన్యభావాల వల్ల బాధపడేవాళ్లలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిల్లో కొన్నిటిని ఈ క్రింద పొందుపరుస్తున్నాం. కాని ఈ క్రింద పేర్కొనబడిన లక్షణాల్లో అన్నీ అందరిలోను ఉండనక్కరలేదు. 1. ఈ భావాలకు లోనైనవాళ్ల శక్తిసామర్థ్యాలు అట్టే వెలికి రావు. వీళ్లు నిరుత్సాహంగా వుండిపోతూంటారు. మనకింతకంటే చేతగాదులే అనుకొంటూంటారు. ఒకోమారు ఇతరులు ఇలాంటి వాళ్లమీద పెత్తనం చేస్తుండడం, వాళ్లను చిల్లరమల్లర పనులకు వాడుకోవడంకూడ కద్దు. 2. ఇలాంటి వాళ్లు మాటలాడేటప్పడు తడబడిపోతుంటారు. అస్పష్టంగా మాటలాడతారు. ఒకటి చెప్పబోయి మరొకటి చెప్తారు. పదిమంది ముందు నిలబడి మాటలాడాలంటే గుండె దడదడలాడుతుంది. కాళ్లు గడగడ వణకుతాయి. సిగూ, భయమూ ముంచుకొనివస్తాయి. గుండె బరువుగా వున్నట్లు కన్పిస్తుంది. 3. వీళ్లు ఒంటరిగా వుండిపోతూంటారు. గదిలో దూరి తలుపు వేసికొంటారు. కిటికీ గుండా ఇతరులను గమనిస్తూంటారు. వేరేవాళ్లతో కలియరు. స్నేహితులంటూ ఉండరు. ಮಿಟ್ಟ! బోలెడంతమంది జనమున్నా తాము మాత్రం ఒంటరిగా వండిపోతూంటారు, మడుగులో ఒంటి కాలిమీద నిలబడి వున్న కొంగలాగ. 4. పోటీల్లో పందాల్లో పాల్గొనరు. అసలు వీళ్లకు సాహసమూ ధైర్యమూ ఉండవు. పదిమంది యెదుటికి రావాలంటే బెరుకు. అంచేత బృందాల్లో గాని, దళాల్లోగాని చేరరు. కార్యారంభశక్తి శూన్యం. 5. ఈలావున్నా తామేమో విజయాన్ని పొందినట్లుగా పగటికలలు కంటూంటారు. భవిష్యత్తులో ఏమో సాధిస్తామనుకొంటూంటారు. తమ్ము అందరూ మెచ్చుకొన్నట్లుగా ఊహిస్తూంటారు. ప్రస్తుతం విజయాన్ని L