పుట:Loochupu-fr.Jojayya.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. మన వ్యక్తిత్వాన్నిమలచే శక్తులు

రవి కాలేజి విద్యార్థి. అతనికి పొడుగాటి దేహం. కోలమొగం. నూగుపూవులాంటి ముక్కు మిలమిల మెరిసే కండ్లు. శుభ్రమైన తెల్లనిరంగు బట్టలు ధరిస్తాడు. చురుకైనవాడు. ఉత్సాహంగా వుంటాడు. మర్యాదగా మాటలాడుతాడు. కలుపుగోలుతనంతో మెలుగుతాడు. సభ్యతగా ప్రవర్తిస్తాడు. మామూలు తెలివితేటలు ఉన్నాయి. కష్టపడి చదువుకుంటాడు. నాటకాలన్నా అభినయమన్నా చెవికోసుకుంటాడు. రోజు రోజు భక్తితో ప్రార్థనం జేసికొంటాడు. ఇవి రవి గుణాలు. ఈ గుణాలనే రవి వ్యక్తిత్వం అంటాం – Personality.

కాని యిలాంటి వ్యక్తిత్వాన్ని రవి యేలా అలవరచుకున్నాడు? మన వ్యక్తిత్వం మాతృగర్భం నుండే ప్రారంభమౌతుంది. జీవితంలోని పరిసరాలనూ, ప్రభావాలనూ బట్టి వృద్ధి చెందుతుంది. శిల్పి ఉలితో పాలరాతిబొమ్మను మలుస్తుంటాడు. అలాగే జీవితంలో కొన్ని పరిసరాలూ, ప్రభావాలూ మన వ్యక్తిత్వాన్ని మలుస్తాయి. ఈలా నరుని వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దే ప్రభావాలు విశేషంగా ఆరున్నాయి. వాటిని క్రమంగా విచారించి చూద్దాం

1. భగవంతుడు

మన వ్యక్తిత్వాన్ని మలచే శక్తుల్లో మొదట పేర్కొనదగింది దైవం. భగవంతుడు మనలను సృజించినవాడు, మనకు తండ్రిలాంటివాడు. నిరంతరం మన స్థితిగతులను విచారించేవాడు. మనలను గూర్చి జాగ్రత్త పడేవాడు. ఈ భగవంతుడు ఓ వ్యక్తి నరుడు కూడా ఈ దేవుని లక్షణాలను అలవరచుకోవాలి. దేవుని బిడ్డలా జీవించాలి. అతని వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా బెట్టుకొని తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఈ లోకంలో గొప్ప వ్యక్తులు చాలామంది ఈలా చేశారు.

నాస్తికులు దేవుని ప్రభావాన్ని నిరాకరిస్తారు. కాని ఆస్తికులు దేవుని ధ్యానించుకొన్నారు. అతని కృపతో అతనిలాంటి వ్యక్తిత్వాన్ని అలవరచు కున్నారు. ఉదాహరణకు, గాంధీ గొప్పవ్యక్తి. కాని అతడు ఈశ్వర ○