పుట:Loochupu-fr.Jojayya.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. హైన్యభావాలూ విచార మనస్తత్వమూ నరుల్లో చాలమంది హైన్యభావాల వల్ల (Inferiority Complex) బాధపడుతూంటారు. ఈ భావాలు కలిగినవాళ్లు అవకాశాలు ఉన్నావృద్ధిలోకి రాలేరు. కొందరు మనస్తత్వ శాస్త్రజ్ఞల ప్రకారం నూటికి 50% ప్రజలు న్యూనతా భావాలవల్ల బాధపడుతూంటారు. ఐనా ఈ యాభై శాతం ప్రజల్లో ఈ భావాలు ఒకే స్థాయిలో వుండవు. కొందరిలో ఈ గుణాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద మగవాళ్లకంటే ఆడవాళ్లు హీనతాభావాల వల్ల అధికంగా బాధపడిపోతూంటారని తెలుస్తుంది.

1. హైన్య భావాలు అంటే ఏమిటి?


ప్రభ, పద్మ కాలేజి విద్యార్ధులు. ప్రభ అందగత్తెగాదు. ఆ యమ్మాయి ముఖం వికృతంగా వుంటుంది. ఈ సంగతి తలంచుకొని ప్రభ బాధపడుతుంది. తోడి విద్యార్థినులతో పోల్చి చూచుకొని కుమిలిపోతుంది. రెండవ అమ్మాయి పద్మకు తెలివితేటలు లేవు, ఒట్టి మొదుపిల్ల. 60నా ఆ యమ్మాయి చాల కలుపుగోలుతనంగా మెలుగుతుంది. అందరితోను కలిసి మెలసి తిరుగుతుంది. ఏ పనిలోనైనా అడిగీ అడగకముందే ఇతరులకు తోడ్పడడానికి సిద్ధంగా వుంటుంది. పద్మ తనకు తెలివితేటలు లేవే అని బాధపడదు. ఏలాగైనా జీవితంలో నెగ్గకపోతానా అనుకొంటుంది. నిబ్బరంగా వుండిపోతుంది. యిద్దరమ్మాయిల్లో ప్రభలో హైన్యభావాలున్నాయి. పద్మలో లేవు. హైన్యభావాల్లో రెండు ముఖ్య లక్షణాలు కన్పిస్తాయి. 1. మనలో ఏవేవో లోపాలంటూ వుంటాయి. వాటిని మనం గుర్తిస్తాం గూడ. అందం లేకపోవడం, పేదవాళ్లంగా వుండిపోవడం, తెలివితేటలు లేకపోవడం, తక్కువ కులాలకు చెందివుండడం, విజయం సాధించలేక పోవడం, శక్తి సామర్థ్యాలు లేకపోవడం మొదలైనవి లోపాలు. 2 మనలోని ఈ లోపాలను అంగీకరించం. వాటిని తలంచుకొని బాధపడిపోతాం.

కొందరు తమలో వున్న లోపాలను అంగీకరిస్తారు. అలా చేస్తే ఇక పెద్దబాధ అంటూ వుండదు. వాళ్లలో హైన్యభావాలు ఏర్పడవుకూడ. కాని