పుట:Loochupu-fr.Jojayya.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జంతువును పట్టి ఒట్టినే హింసించవు. నరులుమాత్రం క్రూరమైన హింసకు పూనుకొంటారు. ఇతరుల బాధలను చూచి ఆనందిస్తూంటారు. ఈ దుర్గుణం కూడా ఆధిక్య భావానికి సంబంధించిందే.

6. మస్తాను అల్లరిజట్టుకు నాయకుడు. ఓ దినం ఆ జట్టవాళ్లంతా వెళ్లి టెలిఫోను తీగలు తెగగొట్టివచ్చారు. మరో దినం కాల్వలోని లాకులు ఊడబీకి నిలువవున్న నీళ్లన్నీ వెళ్లిపొయ్యేలా చేశారు. ఇంకో దినం ఓ రైతు గడ్డివామికి నిప్పంటించి వచ్చారు. ఈలా వాళ్లు ప్రభుత్వం వాళ్ల ఆస్తులనో పౌరుల సొత్తునో పెద్ద ఎత్తున నష్టపరుస్తూంటారు. ఆ నష్టాన్ని చూచి సంతోషిస్తూంటారు. పూర్వం నీరో చక్రవర్తి రోమును తగులబెట్టించి పట్టణం నాశనమైపోతూంటే చూచి తంత్రీవాద్యం మీటుతూ ఆనందిం చాట్ట. ఈలాంటి మనస్తత్వం కొందరిలో వుంటుంది. ఇది కూడ ఆధిక్యగుణం వలన పుట్టిందే.

ఈ వ్యాసంలో ఆధిక్యగుణ లక్షణాలను ఆరింటిని పేర్కొన్నాం. అవి ఇతరులను ఎగతాళి చేయడం, ఏడ్పించడం, కోపపడ్డం, వైరం పెట్టుకోవడం, హింసించటం, అల్లరి జట్టులతో ఆస్తినష్టానికి పూనుకోవడం. ఈ యాధిక్య భావాలు తరచుగా మనలోని అసామర్థ్యం వలననే పుట్టుకవస్తాయి. ఓ సమస్యను ఎదుర్కొని విజయం సాధించలేక అవమానం పొంది వేరే వాళ్లమీద అక్కసు తీర్చుకోబోతాం. మనకంటె తక్కువవాళ్లనూ అలుసైనవాళ్లనూ బాధించి సంతృప్తి చెందుతాం. దీనివలన అపజయ బాధ కొంతవరకైనా తీరినట్లవుతుంది, మనకు నష్టపరిహారం లభించిందికదా అని సంతృప్తి చెందుతాం.

కాని మన అపజయాలను మనమే సరిపెట్టుకోవాలి. మన ఓటమిని అంగీకరించాలి. కృషి చేసి విజయం పొందాలి. ఇంతేగాని ఇతరులమీద అధికారం చెలాయించడంవల్లా, ఇతరులను ఏడ్పించడం వల్లా మన అపజయాలూ, బాధలూ తీరిపోవు. పైగా మనం దుపులమైపోతాం. సమాజం మనలను “భీ” అంటుంది. అందుచేత విద్యారులు చిన్ననాటినుండే ఈ దుర్గుణాన్ని అదుపులో పెట్టుకొనే ప్రయత్నం చేయాలి. L