పుట:Loochupu-fr.Jojayya.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్లాసులో పిల్లలందరి ముందు ఉపాధ్యాయుణ్ణి ఎదిరించి మాటలాడతాడు. కోపం ప్రదర్శిస్తాడు. విరుచకపడతాడు. రఖాన్సీ అంత చురుకైన పిల్లకాదు. ఆ అమ్మాయి ఓ లెక్కచేయడం కోసం గంటసేపు ప్రయత్నించింది. కాని లాభం లేకపోయింది. అందుచేత ఆమె ముఖం కందగడ్డయింది. కళ్లవెంట నీళ్లు గ్రుక్కుకొంది. కోపంతో లెక్కల పుస్తకాన్ని కిటికీగుండా విసిరిపార వేసింది. గదంతా చిందరవందర చేసింది. ఇక్కడ సూర్యం రఖాన్సీ ప్రదర్శించిన కోపతాపాలు కూడ ఆధిక్య భావాన్ని సూచిస్తాయి. మన అసామర్థ్యం బయటపడినప్పడు చిన్నపోయి కోపం చూపెడతాం.

4. ప్రతాపకి సుధాకరంటే గిట్టడు. పోయినమారు వక్తృత్వపు ෆ්‍රීසීද් సుధాకరు గెల్చాడు. అప్పటినుండి సుధాకరును ఏలాగైనా ఓడించాలని ప్రతాపు కోరిక. అంచేత అతడు సుధాకరంటే కారాలుమీరాలు నూరుతుంటాడు. అంజెల చాల చలాకీగా వుంటుంది. క్లాసులో ఉపాధ్యాయిని కూడ ఆమెను మెచ్చుకొంటుంది. కాని ఆమె ఉపాధ్యాయిని మన్నన పొందితే క్యాతిరిన్కు కన్నుకుట్టింది. క్యాతరిన్ అంజెల వృద్ధిని చూచి ఓర్చుకోలేక ఆమె మీద ఏమేమో అపదూరులు మోపుతుంటుంది. పుకారులు పట్టిస్తూంటుంది. ఈలా మనుషులు ఒకరిమీద ఒకరు వైరమూ ద్వేషమూ పెంచుకొంటూంటారు. విశేషంగా ఒకే తావులో, ఒకే వృత్తిలో పనిచేసే వాళ్లలో ఒకరంటే ఒకరికి సుతారమూ గిట్టదు. ఈ మనస్తత్వం గూడ ఆధిక్యగుణ ప్రదర్శనమే ఔతుంది.

5. వేణూది విచిత్రమైన మనస్తత్వం. ఓ దినం అతడు గుప్పెడు పల్లేరు కాయలు కోసికొనివచ్చి క్లాసులో చల్లాడు. విద్యార్ధులు పల్లేరు కాయలు గ్రుచ్చుకొని బాదపడుతూంటే అతడు ఉల్లాసంతో చంకలు ఎగరవేశాడు. ప్రసాదు జంతువులను బాధపెట్టి సంతోషిస్తూంటాడు. కప్పకాళ్లకు త్రాడు బిగించి చెట్టుకొమ్మలకు వ్రేలాడదీస్తాడు. తూనీగలను బట్టుకొని వాని తోకల్లో పెద్ద ముళ్లు గుచ్చి విడిచిపెడతాడు. అవి ఎగురలేక ఎగురుతూంటే చూచి ఆనందిస్తాడు. ఇది హింసాగుణం. సింహం మొదలైన మృగాలు ఆకలైనపుడు ఏదో జంతువును చంపి తింటాయి. కాని ఆ