పుట:Loochupu-fr.Jojayya.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాధపడిపోతూంటారు. కాని Superiorty Compelx వల్ల ఇతరులను బాధపెట్టేవాళ్లు కూడ కొంతమంది వుంటారు. జనులు ఆధిక్య భావాన్ని రకరకాల రూపాల్లో ప్రదర్శిస్తుంటారు. దాని లక్షణాలు చాలా వున్నాయి. ప్రస్తుత వ్యాసంలో ఈ లక్షణాలను ఆరింటిని పరిశీలిద్దాం.

1. మైత్రి కల్యాణిని మాటిమాటికి ఎగతాళి చేస్తుంది. నీది చప్పిడి ముక్కుగా అని వెక్కిరిస్తుంది. కల్యాణి కంటివెంట నీళ్లు పెట్టుకుంటుంది. సత్య వట్టి కొంటె కోణంగి. ఆ అమ్మాయి క్లాసులో పిల్లలందరికీ మారు పేర్లు తగిలిస్తుంది. కొంతమంది పిల్లలకు ఆ పేర్లు ముళ్లలాగ గుచ్చుకుం టాయి. వాళ్లు చాల బాధపడిపోతారు. ఇక్కడ సత్య మైత్రి తమ ఆధిక్యాన్ని చూపడం కోసం ఇతరులను ఎగతాళి చేస్తుంటారు. మన ఎగతాళి నవ్వులాటకే కావచ్చు. నవ్వు పుట్టించవచ్చు గూడ. కాని ఇతరులకు బాధకలిగించినట్లయితే ఆ యొగతాళిని వెంటనే మానివేయాలి. మామూలుగా సున్నితమైన మనస్తత్వం కలవాళ్లు పరియాచకాలను సహించలేరు. పిల్లి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం గదా!

2. సుందరు సీనియరు విద్యార్థి జగదీశు క్రొత్తగా కాలేజీకి వచ్చాడు. ఓ దినం సుందరు జగదీశును అడ్డగించి, § డబ్బుతో నాకు క్యాంటినులో టిఫిను ఇప్పిస్తావా లేక చెవులు నులమమంటావా అని దబాయించాడు. వార్డనుకు చెప్పావో నిన్ను చితకగొట్టేస్తాను చూడు అన్నాడు. గత్యంతరం లేక జగదీశు వాడికి టిఫిను ఇప్పించాడు. మనోహరు పుస్తకాలను విద్యాసాగరు రోజూ క్లాసుకి మోసికొని వెళుతుండాలి. లేకుంటే వాడు వీణ్ణి పచ్చడిచేస్తాడు. ఈ విధంగా పెద్దపిల్లలు చిన్నపిల్లలను ఏడిపిస్తుంటారు. పై యధికారులు క్రింది యధికారులను దబాయించి వాళ్లచేత సేవలు చేయించుకుంటారు. యుజమానులు పనివాళ్లచేత వెట్టిచాకిరి చేయించుకొంటారు. ఈలా మనకంటె తక్కువ వాళ్లను ఏడ్పించడం గూడ ఆధిక్య గుణాన్ని ప్రదర్శించడమే ఔతుంది.

3. సూర్యం ఎప్పడూ పరధ్యానంగా వుంటాడు. పాఠాలు చదవడు. ఉపాధ్యాయుడు వ్యాసం వ్రాసి తీసుకరమ్మంటే తీసుకరాడు. అదే మంటే L