పుట:Loochupu-fr.Jojayya.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టుకోవడానికి పోరాని పోకడలు పోయారు. ఇతరులు తమ పెద్దరికాన్ని ఎలాగైనా గుర్తించాలని ఏవేవో వెర్రిమొర్రి చేష్టలకు పాల్పడ్డారు. చిన్న కుక్క పెద్ద కుక్కను చూచి మొరుగుతుంది. నేను నీవనుకున్నంత చిన్న దానేమీ కాదు సుమా అని దాని భావం. ఈలాగే మనం కూడా వేషాలు వేసూంటాం. వెలుపలి డాబూ, పటాటోపమూ ప్రదర్శించి మన అసామర్థ్యాన్ని కప్పిపెట్టుకొంటూంటాం - Showing off.

4. ఉష, రజని, ఓ వృత్తి విద్యాలయంలో చదువుకొంటున్నారు. ఉష దర్జీపని నేర్చుకొంటూంది. ఓ మారు బట్టలు కత్తిరిస్తూ కత్తిరిస్తూ కొలతలకు మించి కత్తిరించింది. ఇక ఆ బట్టలు డిసైనుకు పనికిరావు. ఆ యమ్మాయి తన తప్పను గుర్తించి "ఎంత పాడు కత్తెరమ్మా! ఎప్పుడూ సరిగా కత్తిరించి ఎరుగదు" అంటూ కత్తెరను అవతల పారేసింది. రజని నాట్యం నేర్చుకో బోయింది. కాని ఆ యమ్మాయికి దేహలాఘవం లేదు. అలసిపోతుందే గాని నాట్యభంగిమలు నేర్చుకోలేదు. తన లోపాన్ని గుర్తించి "ఈ టీచరమ్మకు అసలు నాట్యం నేర్పడమే రాదు" అని ఉపాధ్యాయినిని తిట్టింది.

ఈ పిల్లలిద్దరూ వాళ్ల లోపాలను ఒప్పకోరు. తమ లోపాలను కప్పి పెట్టుకోవడానికై వేరే వాళ్లను దూయబడుతూంటారు. పూర్వమెవరో నర్తకి ఆడలేక మద్దెలను తిట్టిందట. ఈలాగే మనంకూడ సామర్థ్యం చాలక ovororogo &oezo-Shifting the blame. 5. జగన్నాథు మొండిచేతివాడు. తన అవిటితనాన్ని చూచి తోడి విద్యార్థులు ఎక్కడ నవ్విపోతారో అని అతని భయం. తానేవిధంగానైనా గొప్పవాణ్ణనిపించుకోవాలి. అందుచేత అతడు ఓ రాజకీయ పక్షాన్ని ఆశ్రయించి కాలేజిలో సమ్మె లేవదీశాడు. విద్యారులను క్లాసులకు వెళ్లనీయకుండా ఆపివేశాడు. తాను విద్యార్థి నాయకుడని పేరుగాంచాడు. రహీము డిగ్రీ క్లాసు రెండవ యేటి పరీక్షల్లో వేటిలోనూ పాసుకాలేదు. విద్యార్థుల్లో తనకు గౌరవం పోతుందేమోనని అతని భయం. అంచేత అతడు క్లాసులో అల్లరి చేస్తుంటాడు. కొంతమంది పోకిరిరాయుళ్లును జట్టుగూర్చుకొని ఉపాధ్యాయులను ఏడిపిస్తూంటాడు.