పుట:Loochupu-fr.Jojayya.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుప్రసిద్ధమైన కాలేజిలో డిగ్రీ క్లాసు చదవాలని ఉవ్వికూరేవాడు. ఓ ఘరానా పెద్ద మనిషిచేత సిఫారసు కూడ చేయించాడు. కాని ఆ కాలేజిలో అతనికి ప్రవేశం లభించలేదు. మిత్రులు తేజను నీవు కోరుకున్న కాలేజీలో చేరలేదేమని అడుగగా అతడు “ఆ వెధవ కాలేజీలో ఎవరు చేరతారు? ఒట్టి వదంతులేగాని అసలా కాలేజీలో స్టాండర్డ్ ඒරථෂ් నమ్మండి" అన్నాడు.


ఇక్కడ ఆ యిద్దరు విద్యార్థులు అనుకొన్నది సాధించలేకపోయారు. కాని వాళ్లు మేము అపజయం పొందామని ఒప్పకోరు. వాళ్లలోని అహం ఓటమిని అంగీకరించడానికి యిష్టపడదు. అది ఓ పెద్దనామూషి. అందుచేత వాళ్లు ఏదో రక్షణమార్గం వెతుకోవాలి. పూర్వమొక నక్కగుత్తులు గుత్తులుగా వ్రేలాడే ద్రాక్షపండ్లను చూచి వాటిని కోసికోవాలని చాలాసార్లు ఎగిరింది. కాని అవి దాని కందలేదు. చివరకు అలసిపోయి ఈ పుల్లని ద్రాక్షపండ్లెవరికి కావాల్లే అనుకొంటూ వెళ్లిపోయింది. ఇక్కడ రాజు, తేజూ కూడ ఈ పల్లని ద్రాక్షపండ్ల మనస్తత్వాన్డ్నేప్రదర్శించారు - Sour grapes mechanism.


3. వేణుకి పొట్టకోసినా అక్షరంముక్క రాదు. కాని శుంఠ అనిపించుకుంటే నామూషి అని అతని భయం. అందుచేత డాబుగా దుస్తులు వేసికొని తిరుగుతూంటాడు. తోడి విద్యార్థులు తన ఆకారాన్ని చూచైనా తన్ను గౌరవించకపోతారా అని తాపత్రయ పడుతూంటాడు. దాసుకి కాలేజీలో పలుకుబడిలేదు. అతడు ఏలాగైనా పలుకుబడి సంపాదించాలన్న తహతహతో కాలేజీ నియమాలను ఉల్లఘింస్తూంటాడు. నియమోల్లంఘనకు గాను శిక్షను పొందుతూన్న నెపంతోనైనా పదిమంది తన్ను గుర్తించేలా చేసికోవచ్చుగదా అని అతని ఆందోళనం. గోపీ పెద్ద వక్షేమీకాదు. ఐనా అతడు వ్యక్తృపు పోటీని యేర్పాటు చేసి పదిమంది ముందు చాల డాబుగా మాటలాడుతాడు. తనకు మాటలాడ్డం చేతనైనా కాకపోయినా తాను మాత్రం వక్త ననిపించుకోవాలని అతని కోరిక.


ఇక్కడ ఈ ముగ్గురు విద్యార్థులూ తమ చేతగాని తనాన్ని కప్పి