పుట:Loochupu-fr.Jojayya.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. అపజయాలూ రక్షణ మార్గాలూ జీవితం మన మనుకొన్నంత సాఫీగా నడవదు. బోలెడన్ని నిరాశలూ అపజయాలూ కలుగుతూంటాయి. కాని మనం ఈ అపజయాలను భరించలేం. మనలోని అహం అపజయాలవల్ల కలిగే దుఃఖాన్నీ నామూషినీ ఓర్చుకోలేదు. కనుక జీవితంలోని అపజయాలనుండి మనలను మనమే రక్షించుకోగోరుతూంటాం. ఈలాంటి రక్షణమార్గాలు (Defence Mechanisms.) చాలా వున్నాయి. ప్రస్తుతానికి వాటిల్లో ఆరింటిని గూర్చి విచారిద్దాం.

1. క్రిస్టీన కాలేజి విద్యార్థిని. ఓ మారు ఆ యమ్మాయి వేరే కాలేజీలో చదువుకొనే బాలికలతో మాటలాడుతుండగా తన కాలేజీ డే ప్రస్తావన వచ్చింది. ఇతర కాలేజి విద్యార్థినులు “మీ కాలేజి డే కి నీవు నాట్యం చేస్తున్నావా?" అని అడిగారు. క్రిస్టీన "నాట్యం చేయడానికి నాకు తీరికెక్కడి దమ్మా! ఇంటిదగ్గర మా అమ్మకు రోజూ సహాయం చేస్తూండాలి" అని తప్పకొంది. యదార్థంగా క్రిస్టీన తల్లికి చేసే పెద్ద సహాయమేమీ లేదు. అసలు జరిగిందేమిటంటే కాలేజీ డే కి నాట్యం చేయడానికి ఆ యమ్మాయి నెవరూ ఎన్నుకోలేదు. కాని తనకు నాట్యం చేయడం చేతగాదు అనిపించుకో గూడదు. తన అంతరాత్మ తన్ను తక్కువగా గణించకూడదు. కనుక ఏడో సాకు చెప్పి మిత్రురాండ్రనుండి తప్పించుకొంది. జీవితంలో అన్నీ సాధించలేం. కాని నేను పలానా కార్యాన్ని సాధించలేకపోయాను అని చెప్పకొంటే పెద్ద నామూషి. కనుక ఏవో సాకులు చెప్పి మన అసామర్థ్యాన్ని &örö3&oočwo - Explaining away one's failure.

2. రాజు, తేజ ఇంటర్ విద్యార్థులు. రాజు నేను ఫస్టుక్లాసులో పాసై ప్రొఫెషనల్ కాలేజీలో చేరతానని చెప్పకొంటూండేవాడు. కాని చివరికొచ్చే ప్పటికల్లా అతనికి సెకండుక్లాసు వచ్చింది. రాజును ఏం జరిగిందని అడిగితే “పుస్తకాల పురుగును గావడం నా కిష్టంలేదు. అంచేత పరీక్షకు అమితంగా చదవడం మానేశాను’ అని తప్పకొన్నాడు. తేజ ఓ