పుట:Loochupu-fr.Jojayya.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనవిమాట

చైతన్యవాణి పత్రికలో వ్యక్తిత్వ వికాసాన్ని గూర్చి కొన్ని వ్యాసాలు వ్రాశాం. వాటినే యిక్కడ గ్రంథరూపంలో ముద్రించాం. ఈ వ్యాసాలన్నీ మనస్తత్వ శాస్తానికి సంబంధించినవి. నరుల వ్యక్తిత్వం విచిత్రమైందీ లోతైందీ కూడ లోచూపు వుంటేనేగాని దాన్ని అర్ధం చేసికోలేం. నేడు వ్యక్తిత్వాన్ని గూర్చి చాల పుస్తకాలు వస్తున్నాయి. ఈ గ్రంథంలో వ్యక్తిత్వాన్ని గూర్చిన ముఖ్యాంశాలు ఉదాహరణలతో వివరించాం. ఇది ముఖ్యంగా హైస్కూలు, కాలేజి విద్యార్ధులకు ఉద్దేశింపబడింది. విద్యార్ధులు తమ్మతాము పరిశీలించి చూచుకొని తమ శక్తిసామర్థ్యాలను వృద్ధిచేసికోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఇది చైతన్యవాణి పూచిన తొలిపూవు