పుట:Loochupu-fr.Jojayya.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారాబంతో చూడరు. మన ప్రవర్తనం ప్రాయానికి తగినట్టుగా వుండాలి. కనుక చిన్నపిల్లల్లాగా ప్రవర్తించి సమస్యలను తప్పించుకో జూడ్డంవలన ergo δέ — Actingthe child.

5. ప్రాన్సిస్, మణి హాస్టలు విద్యార్ధులు. ఓ మారు ఏదో సందర్భాన్ని పురస్కంచుకొని హాస్టల్ విద్యార్ధులు టిపార్టీ ఏర్పాటుచేసికొంటున్నారు. కాని ఫ్రాన్సిస్కు మాత్రం ఆ టీ పార్టీ ఏర్పాటుచేయడం ఇష్టంలేదు. కనుక అతడొక్కడే మాట్నీకి వెళ్ళిపోయాడు. టీపార్టీలో హాస్టలు విద్యార్డులు సూర్యాన్ని ఆయేటి ఉత్తమ విద్యార్థిగా నిర్ణయించి అభినందించారు. కాని మణికి సూర్యాన్ని ఎన్నుకోవడం ఇష్టంలేదు. అతడు తన మిత్రులు ముందు సూర్యాన్ని విమర్శించాడు.

ఈలా జీవితంలో మనకు ఇష్టంకాని పనులపట్ల అసమ్మతిని జూపుతూంటాం, ముఖం తప్పించుకొంటుంటాం. లేదా ఇతరులనో వారి కార్యక్రమాలనో విమర్శిస్తుంటాం. ఇది కూడా సమస్యలనుండి తప్పించు కొనే మార్గమే. ఈలాంటి ప్రవర్తనం ద్వారా మన అసమ్మతినీ అలుగుడునూ తెలియ జేస్తూ వుంటాము. – Being hard to live with.

6. జయరాజు మరో విద్యార్ధికి యాభై రూపాయలు అప్పపడ్డాడు తనగదిలో వుండే తోడి విద్యార్ధితో పోట్లాడాడు కూడ వార్డన్గారు జయరాజును మందలించి ఈ రెండు సమస్యలూ మొదట చక్కదిద్దుకొమ్మని చెప్పారు. కాని అతడు ఈ సమస్యలను పరిష్కరించుకోడు. వానినుండి తప్పకోడానికై నిత్యం హాస్టలు తోటలో పనిచేస్తుంటాడు. పోద్దస్తమానమూ నేల త్రవ్వుతూంటాడు.

ఈలా కొంతమంది జీవిత సమస్యల నుండి తప్పకోవడానికి ఏవేవో క్రొత్తపనులు చేపడుతుంటారు. పని నెపంతో సమస్యలనుండి వైదొలగ జూస్తుంటారు. కాని మనం పనిచేయడానికి జీవించం. జీవించడానికి పనిచేస్తాం. జనులు సామాన్యంగా పనిచేయడానికి ఒప్పకోరు. పనిని తప్పించుకోవాలని చూస్తూంటారు. కాని కొంతమందికి మాత్రం ఈ పనే ఓ వ్యసనంగా పరిణమిస్తుంది. ఈ లాంటి వాళ్ళకు పని లేకపోతే