పుట:Loochupu-fr.Jojayya.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూచి ఈ పట్టణమేలే రాజు తన కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాడు. మాకు ఓ మగబిడ్డ పుడతాడు. ఓ దినం ఆ శిశువు గీ పెట్టి ఏడుస్తుంటే నా భార్య పరాకువల్ల బిడ్డనెత్తుకోవడానికి రాదు. అప్పడు నేను కోపం వల్ల ఈ చేతికర్రతో ఆవిడను చావమోదుతాను. ఈలా అనుకుంటూ సక్తుప్రస్టుడు తన చేతికర్రతో మోదాడు. అది దుత్తకు తగిలి పేలపిండికాస్త నేలగలిసిపోయింది. బహు ప్రాచీనమైన ఈ సంస్కృత కథ నరుల చిత్తవృత్తిని చక్కగా చిత్రిస్తుంది. (సక్తు అంటే పేలపిండనీ, ప్రస్టుడు అంటే కలవాడనీ అర్థం). ఈలాంటి పగటికలల వలన సమస్యలు తీరిపోవు కదా ఇంకా విషమిస్తాయి. ఐనా కొంతమంది జీవిత సమస్యలనుండి తప్పకోవడానికై దినమంతా ఏవేవో కథలు చదువు కుంటూనో, రేడియోలు వింటూనో కూర్చుంటారు. సినిమా చూస్తూ కాలక్షేపం చేస్తూంటారు. త్రాగుడు నల్లమందు మెదలైన దురభ్యాసాలకు కుడా అలావాటు పడుతుంటారు. ఇవన్ని పలాయన మార్గాలు. ఈలాంటి దురభ్యాసాల నుండి విద్యార్ధులు జాగ్రత్తగా తప్పకొంటుండాలి.మనకు మనమే ఓ ఊహా ప్రపంచాన్ని సృజించుకొని పగటికలలు కంటు &2&yod & 35%– Living in a dream World.

4. రీత కాలేజి విద్యార్థిని. ఇంట్లో ఆ ಆಮಿಯು కోరుకున్నట్లుగా జరగాలి. అలా జరక్కపోతే రీత బుంగమూతి పెట్టుకుంటుంది.వాళ్ళమ్మ ముందు ఏడుస్తుంది. చిందులు త్రోక్కుతుంది. అద్దం పగలగొడుతుంది. అలంకరణ వస్తువులన్నీ విసరి నేలకుగొట్టి గదంతా చిందర వందర చేస్తుంది. వాళ్ళమ్మ ఎంత బతిమాలినా ఊరుకోదు. 

మనమంతా చిన్నపిల్లలంగా ఉన్నప్పడు ఈలా అల్లరిచేసి అమ్మనాన్నల యెదుట విజయం సాధించాం. అప్పడు మన ఏడ్పుకు పెద్దవాళ్ళు లొంగిపొయారు. చిన్నపిల్లలంగదా అనుకుని మన మడిగిం దల్లా యిచ్చారు. ఇప్పడు పెద్దవాళ్ళమయ్యాక గూడ జీవితంలోని సమస్యలు ఎదురయ్యేపుడెల్లా ఇదే ఆయుధం ప్రయోగించవచ్చు అనుకుంటాం. కాని చిన్నప్పడులాగ ఇప్పడు వాళ్ళు మనలను (25)