పుట:Loochupu-fr.Jojayya.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సెలవులు ముగిశాక సకాలంలో బడికి తిరిగిరాడు. ఎప్పడూ ఒకటి రెండు రోజులు ఆలస్యంగా వస్తూంటాడు. అదేమంటే యింటిదగ్గర అమ్మకో నాన్నకో జబ్బుగా వుండడం వల్ల కొంచెం ఆలస్యంగా వచ్చానని సాకులు చెప్తాడు.

ఈలా వ్యాధిగా వ్యన్నట్టు నటిస్తూ చాలామంది సమస్యలనుండి తప్పకో జూస్తూంటారు. వ్యాధిగా ఉన్నవాళ్లంటే సహజంగానే సానుభూతి చూపుతాం. పాపం అనారోగ్యంగా వున్నాళ్లే అంటాం. అందుచేత జనులు ఈవ్యాధి అనే సాకును ఉపయోగించి సమస్యనుండి తప్పకొంటూంటారు. మరీ చిన్నపిల్లల్లో ఈ జిత్తులు ప్రచురంగా కన్పిస్తాయి- Illness as a dodge.

3. నళిని కాలేజీ విద్యార్థి. క్లాసులో ఎప్పడూ పరధ్యానంగా వుంటుంది. ఉపాద్యాయిని అడిగే ప్రశ్నలకు జవాబులు చేప్పలేక వెలవెలబోతుంది. ఆ యవమానాన్ని దిగమ్రింగుకోవడానికి ఈలా పగటికలలుకంటుంది. తాను పెద్ద చదువులు చదివి జిల్లా కలెక్టరును పెండ్లి చేసికొంటుంది. ఇదే కాలేజీలో కాలేజీడే జరుగుతూండగా తన భర్త అధ్యక్షుడుగావేదిక నలంకరిస్తాడు. తాను ఠీవితో భర్త ప్రక్కన కూర్చొంటుంది. విద్యార్థినులకు బహుమతులు పంచిపెడుతుంది. ఆటొగ్రాఫీలు వ్రాసియిస్తుంది. ఈ దినం తన్ను తిట్టిన ఉపాధ్యాయినులంతా ఆదినం తెల్ల బోయి చూస్తారు. నళిని ఇంత సమర్థురాలా అని ముక్కుమీద వేలు పెట్టుకుంటారు....అనుకొంటుంది.

కొంతనుంది జీవితంలో విజయం సాధించలేరు. వాళ్ళ అంత రాత్మ వాళ్ళనే ఎగతాళిచేస్తుంది. నిందిస్తుంది. అందుచేత వాళ్ళు ఊహా విజయాలతో పగటికలలతో ఈ నిందనుండి తప్పకోజూస్తుంటారు. పంచతంత్రంలోని సక్తుప్రస్తుడు மூன் బ్రాహ్మణ వటువు కథ ఈలాంటిదే. అతడు ఓ పాడుపడిన దేవాలయంలో వసిసూ భిక్షమెతుకొని బ్రతికే వాడు. ఓమారు అమావాస్యనాడు భిక్షానికి వెళ్ళగా ఓ యింటావిడ దుత్తెడు పేలపిండి పెట్టింది. ఆ పేలపిండి ముందు పెట్టుకొని పొంగిపోతూ సక్తుప్రస్టుడు ఈలా పగటి కలలు కన్నాడు : దీనమ్మి కోళ్లనూ, వాటినమ్మి మేకలనూ, వాటినమ్మి గోవులనూ కొంటాను. తామరతంపరగా పెరిగి పోయే నా సరిసంపదలను L