పుట:Loochupu-fr.Jojayya.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. సమస్యలను ఎదుర్కోవాలా తప్పకోవాలా?

వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగోరేవాళ్లకు బోలెడన్ని అవరోధాలు కలుగుతుంటాయని చెప్పాం. జీవితంలోని సమస్యలను తప్పించుకొని తిరగడం గూడ ఈలాంటి అవరోధాల్లో ఒకటి. జీవిత సమస్యలను ఎదుర్కోకపోతే మన వ్యక్తిత్వం వృద్ధిచెందదు. చాలామంది సమస్యలను ఎదుర్కోనే యెదుర్మోరు. వాటిని ఏలాగో ఓలాగు తప్పించుకోజూస్తూం టారు. దీనివల్ల సమస్య వాయిదాపడుతుందేగాని పరిష్కారం కాదు. మామూలుగా పెద్దవాళ్లుగాని చిన్నవాళ్లు గాని సమస్యల నుండి తప్పకొనే విధానాలు ఆరున్నాయి. వాటిని క్రమంగా విచారించి చూద్దాం.

1. రాజు, గోపీ కాలేజి విద్యార్థులు. రాజు రోజంతా నిదురపోవాలని కోరుకుంటాడు. సకాలంలో నిద్రలేవడు. క్లాసులో కూడ కునికిపాట్లు పడుతూంటాడు. ఇక చదువేలా వస్తుంది? గోపి ఉల్లాస కార్యక్రమాలన్నా విహార యాత్రలన్నా చెవులు కోసికొంటాడు. క్లాసులో కూడ వీటికి ప్రణాళికలు తయారుచేస్తుంటాడు. ఇక పాఠా లేలా వస్తాయి?

మనకందరకూ ప్రాథమికావసరాలంటూ వుంటాయి. చక్కగా నిద్ర పోవడమూ ఉల్లాసం చెందడమూ అవసరమే. కాని ఏ పని చేసేప్పడు ఆ పని చేయాలి. క్లాసులో పాఠాలు జరిగేటప్పడు ఇంకోపని చేయకూడదు. ఇక్కడ ఈ విద్యార్ధులిద్దరూ నిద్రపోవడం ఉల్లాస కార్యక్రమాలు తయారు చేసికోవడం అనే ప్రాథమిక అవసరాలను తీర్చుకొంటూ పాఠాలు నేర్చుకోవడమనే సమస్యలనుండి తప్పకోజూస్తున్నారు. ఈలా చేస్తే దినమంతా ప్రాథమిక అవసరాలను ë&otoč Kośo – Over indulging our human needs.

2. సురేశు జగదీశు హైస్కూలు విద్యార్థులు. సురేశుకు పరీక్షలు దగ్గరకు రాగానే ఏదో వ్యాధి పుట్టుకవస్తుంది. తలనొప్పే జ్వరమో ఏడో వచ్చిపడుతుంది. దానితో అతడు పరీక్షలు ఎగగొడతాడు. జగదీశు GD