పుట:Loochupu-fr.Jojayya.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీవితంలో నిత్యం లభిస్తూనే వుంటాయి. ఈలాంటి వాటిల్లో పాల్గొని గొప్పగా గాకపోయినా ఒక పాటిగానయినా మనశక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూండాలి. కనుక తగనిబెటు, తప్పించుకోవడం అనే అనిష్ట గుణాలను తొలగించుకోకపోతే వ్యక్తిత్వం వృద్ధి చెందదు. - Fals Pride and false Inferiority.

4. సంయుక్త జయప్రద హైస్కూలు విద్యార్థినులు. సంయుక్త చక్కగా పాడగలదు. కాని ఓ మారు స్కూలులో జరిగిన సంగీతపు పోటీలో పాల్గొని ఓడిపోయింది. అప్పటినుండి ఆ యమ్మాయి వేదికమీద కెక్కి పాడడానికి ఇష్టపడదు. ఎంత బ్రతిమాలినా ముందుకిరాదు. జయప్రద కూడా చిత్రలేఖనం పోటీలో రెండు మూడుసార్లు ఓడిపోయింది. ఐనా ఆ యమ్మాయి వెనుకాడదు. చిత్రలేఖన ప్రదర్శనం జరిగినప్పడెల్ల తానూ బొమ్మలు గీసి పోటీలో పాల్గొంటూనే వుంటుంది.


ఈ యిద్దరు పిల్లల చిత్తవృత్తులలో వ్యత్యాసం ఏమిటి? సంయుక్త అపజయాన్ని ఎదుర్కొని నిరుత్సాహ పడిపోయింది. జయప్రద అలా నిరుత్సాహ పడిపోకుండా అపజయాన్ని ఎదిరించి నిల్చింది. జీవితంలో బోలెడన్ని అపజయాలు కలుగుతాయి. వాటివల్ల నిరుత్సాహపడిపోకూడదు. ఒకోమారు జీవితంలో అందరమూ ఓడిపోతూనే వుంటాం. అంతమాత్రం చేతనే వెనుదీయగూడదు. అబ్రహాంలికను చాల గొప్ప ప్రెసిడెంటు. ఐనా అతడు రకరకాల పోటీల్లో ఏడుమార్లు ఓడిపోయినంక గాని అధ్యక్షపదవి నలంకరించలేదు. మహమ్మద్ ఘజ్నీ 17 సార్లు దండయాత్రలు చేసి ఓడిపోయినంక గాని ఇండియాను ఆక్రమించుకోలేదు. ఈలా నాయకులు ఓటమి వలన నిరుత్సాహపడరు. నిరుత్సాహం చెందామో, మనలో నాయక లక్షణాలు లేవనే అర్థం. భర్తృహరి చెప్పినట్లు మట్టిముద్దను నేలకేసి కొడితే నేలకు కరచుకొనిపోతుంది. బంతిని నేలకేసికొడితే పైకెగురుతుంది. అపజయాలు కలిగినపుడు మన ప్రవర్తనం కూడా ఈ బంతిలాగే వుండాలి. అపజయాన్ని నిరుత్సాహాన్ని జయించందే మన వ్యక్తిత్వం వృద్ధి చెందదు - Failure and Discouragement. (21)