పుట:Loochupu-fr.Jojayya.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుట్టుకవస్తుంది. భయం ప్రస్తుత విషయాన్ని గూర్చి విచారం లేక ఆందోళన రాబోయే విషయాన్ని గురించి. ఈ భయ విచారాలవల్ల చాల దుష్ఫలితాలు కలుగుతాయి. నిద్ర చెడిపోతుంది. శక్తి సన్నగిల్లిపోతుంది. మేధాశక్తి అట్టే పనిచేయదు. "నేను చేతగాని వాణ్ణిలే" అనే భావం బలపడుతుంది. కనుక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగోరేవాళ్లు ఈ భయమనే అనిష్ట గుణాన్ని తప్పకుండా తొలగించుకోవాలి. మనం ఈ పని చేయగలం అనుకొంటే చేసి తీరతాం. చేయలేము అనుకుంటే చేయలేం. ఇది ఓ విధమైన మానసిక నియమం. ఈ నియమాన్ననుసరించి విద్యార్థులు ఎప్పడూ "నేను పలానా పనిని సాధించగలను" అనుకొంటూండాలి. ఈలా అనుకునే వాళ్లు భయవిచారాలను జయిస్తారు– Fear and Worry.

3. ఓ మారు హైస్కూలు విద్యారులంతా కొండలోయకు విహారయాత్రకు వెళ్లారు. కొండా నదీ చెటూ పచ్చనిగడ్డీ రకరకాల పక్షులూ వీటన్నితో ఆ ప్రదేశం చాలా రమ్యంగా వుంది. విద్యార్థులు మురారిని పిలిచి అభినయమూ హాస్యమూ చేయమన్నారు. కాని మురారి సిగ్గు వల్ల ముందుకు రాలేదు. రెండు మూడుసార్లు పిలిచినా తగనిబెట్టుతో అలాగే వుండిపోయాడు. తర్వాత వినోద్ను పిలిచారు. అతడు లేచి మిత్రుల ముందు ఏకపాత్రాభినయం చేసాడు. హాస్యం ప్రదర్శించాడు. పాటలు పాడాడు. అందరూ చేతులు తట్టి అతన్ని అభినందించారు. అంతా ముగిసాక మురారి “ఇవన్నీ నాకూ వచ్చు కదా! ఐనా ముందుకి పోలేక పొయ్యాను గదా!" అని విచారించాడు. అతడు శక్తి వుండి కూడ చేతిలోనికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నాడు.

ఈ యిద్దరి మనస్తత్వాల్లో భేదం ఏమిటి? మురారి తగనిబెట్టు చూపించాడు. తప్పించుకున్నాడు. కాని వినోద్ అలా చేయలేదు. లభించిన అవకాశాన్ని ఉపయోగించుకొని తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాడు. వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగోరేవాళ్లు చేతజిక్కిన, అవకాశాన్ని జారవిడుచుకోగూడదు. పాటలు పాడడమూ ఉపన్యాసాలు ఈయడమూ నటించడమూ ఏదో బాధ్యత వహించడమూ మొదలైన అవకాశాలు