పుట:Loochupu-fr.Jojayya.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిత్యం దూయబడుతూంటారు. దీనివల్ల చిన్నవాళ్లల్లో ఆత్మవిశ్వాసం నశించిపోతుంది. మాటిమాటికీ పరాజయం పొందడం గూడ ఓ కారణం కావచ్చును. దీనివల్లగూడ ధైర్యం తగ్గిపోతుంది. చాలా ఉన్నత ఆశయాలు పెట్టుకొని వాటిని సాధించలేకపోవడమూ ఓ కారణం కావచ్చు.

ఏమైతేనేం, చాలమంది ఈ జంకుకు లొంగిపోతుంటారు. ఇక దీనిని తొలగించుకొనే మార్గం చాలా ముఖ్యం. జీవితంలో చాలామంది మనకు సహాయం చేస్తుంటారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్నేహితులు మనలను ఆదుకోవడానికి సిద్ధంగా వుంటారు. కనుక మనం ధైర్యం తెచ్చుకోవాలి. పైగా ముందు సాధించిన విజయాలను స్మరించుకోవడం గూడా మంచిది. దీనివల్ల మనమీద మనకే విశ్వాసం ఏర్పడుతుంది. పైగా జీవితంలో అప్పడప్పడు పరాజయం పొందడంలో తప్పేమీలేదు అనుకోవాలి. ఈమారు ఓడిపోతే మరోమారు గెలుస్తాం అంతే. కనుక జీవితంలో జంకూ, కుమిలిపోవడమూ అనే అనిష్ట గుణాలను అవశ్యం &efiososovë, Self - doubt and Self-pity. & Soč చెప్పబోయే నాలు గుణాలు కూడ పై జంకువల్ల పుట్టినవే.

2. నిర్మల, విమల కాలేజి విద్యార్థినులు. నిర్మల చాలా క్రమబద్ధంగా జీవిస్తుంది. ఎవరిచేత ఒక్కమాట అనిపించుకోదు. పరీక్షలకు చక్కగా చదువుతుంది. ఐనా పరీక్షలు సమీపించేటప్పటికల్లా ఆ యమ్మాయికి విపరీతమైన భయం పుట్టుకవచ్చింది. జ్వరం గూడ తగిలింది. విమల ఉద్యోగానికి యేదో ఆఫీసుకు ఇంటర్వ్యూకు వెళ్లింది. ఇంటర్వ్యూ బోర్డు ముందు చాల ధైర్యంగా మాటలాడింది. అడిగిన ప్రశ్నలకు తృప్తికరంగా జవాబు చెప్పింది. ఆఫీసర్లు ఆ యమ్మాయి నిబ్బరానికి, ధైర్యానికీ ¿oo 2 మెచ్చుకున్నారు.

ఈ యిద్దరమ్మాయిలకు భేదం ఏమిటి? నిర్మలకు భయపడే గుణం వుంది. విమలకు భయస్వభావం లేదు. జీవితంలో ఉచితమైన భయం మంచిదే కాని, పిరికితనం పనికిరాదు. చీటికిమాటికి భయపడిపోయే స్వభావంకలవాళ్లకు మంచి వ్యక్తిత్వం అలవడదు. భయం వలన విచారం