పుట:Loochupu-fr.Jojayya.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. మనవ్యక్తిత్వమూభయవిచారాలూ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలంటే బోలెడన్ని అవరోధాలు కల్లుతుంటాయి. ఈ అవరోధాల వల్ల చాలామంది గొప్పవ్యక్తులు కాలేకపోతున్నారు. ఈలాంటి అవరోధాలు విశేషంగా నాలున్నాయి.ఈ నాల్గింటిలో మొదట పేర్కొనదగ్గవి భయ విచారాలు. ఈ భయవిచారాలు ఐదు రూపాల్లో ప్రత్యక్షమౌతుంటాయి. ఈ వ్యాసంలో ఈ ఐదు రూపాలను క్రమంగా విలోకిద్దాం. 1. బోసు, ప్రతాపు కాలేజీ విద్యార్థులు, మిత్రులు. సంవత్సరారంభంలో బోసుని లలితకళా సమాజానికి కార్యదర్శిగా ఎన్నుకొన్నారు. కాని బోసుకు ధైర్యం తక్కువ. పదిమంది ముందు నిల్చి మాట్లాడాలంటే గుండె నీరైపోతుంది. కాళ్లు కూడ వణకుతాయి. అంచేత బోసు ఆ పదవిని అంగీకరించలేకపోయాడు. ప్రతాపుని వక్తృత్వ సమాజానికి కార్యదర్శిని చేయాలనుకున్నారు. అతనిది సింహపు గుండె పదిమంది ముందు ధైర్యంగా నిలువగలడు. ధాటీగా మాట్లాడగలడు. కనుక ప్రతాపు ఆ పదవిని అంగీకరించాడు. ఈ యిద్దరు యువకుల స్వభావాల్లో భేదం ఏమిటి? బోసుకి జంకు యొక్కువ. ఆత్మవిశ్వాసం లేదు. ప్రతాపుకి ఆత్మవిశ్వాసం వుంది. ధైర్యమూ వుంది. జీవితంలో చాలామందికి జంకూ బెదురూ ఎక్కువ. అంచేత వాళ్లు సమస్యలను ఎదుర్కొనలేరు. కష్టాలు వచ్చినప్పడు విచారిసూ కూర్చుంటారు, కార్యాంభరమంటూ జరగదు. తమచేతగానితనాన్ని తలంచుకొని తమలో తామే కుమిలిపోతుంటారు. ఈ జంకుకీ, కుమిలిపోవడానికీ కారణాలు చాలా వుండవచ్చు. వ్యక్తి తన్ను తాను అంగీకరించుకోకపోవడం మొదటి కారణం. మన లోపాలను మనం అంగీకరించి సరిదిద్దుకొంటే ఏ చిక్కులూ రావు. పెద్దలు మనలను ఇతరులతో పోల్చి మనం చేతకానివాళ్లం అనిచెపుతూ వుండడం గూడా ఓ కారణం. కొంతమంది తల్లిదండ్రులూ ఉపాధ్యాయులూ తమ పిల్లలను