పుట:Loochupu-fr.Jojayya.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహమ్మదీయాలు. గీత, బైబులు, కొరాను యీ మతాల ప్రధాన గ్రంథాలు. ఈ మతాలకు చెందిన విద్యార్థులకు ఈ గ్రంథాలతో చక్కని పరిచయం వుండాలి. కొందరు విద్యావంతులు లౌకిక నాగరికతను ప్రదర్శించడానికి వెనుదీయరు గాని, మత నాగరికతను ప్రదర్శించడానికి సిగ్గుపడుతూం టారు. ఇది చాలా శోచనీయమైన సంగతి.

ప్రార్థన, మతాచరణంతో పాటు శీలసంపత్తి కూడ అవసరం. నరుడు నైతికంగా విశుద్ధజీవితం జీవించాలి. నిజాయితీ, మాట తప్పమి, వంచన చేయమి మొదలయిన సదుణాలు అలవరచుకోవాలి. స్వీయధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించడం నేర్చుకోవాలి.

భగవద్భక్తీ దైవభీతీ కల నరుడు తోడి ప్రజలతో ఒద్దికగా మెలగు తూంటాడు. తోడి ప్రజల్లో కూడ ఆ భగవంతుణ్ణి గుర్తిస్తూ అందరినీ అక్కచెల్లెళ్లలాగా అన్నదమ్ముల్లాగా ఆదరిస్తూంటాడు. దేవునిపట్ల భక్తీ తోడి ప్రజలపట్ల సోదరభావమూ, వాక్కూ అర్థమూలాగ అవిభక్తంగా వుండిపోవాలి.

శారీరక, వైజ్ఞానిక, ఆధ్యాత్మికావసరాలు నరుని ప్రాథమికావసరాలు. ఈ యవసరాలను తీర్చుకొనని నరునికి చక్కని వ్యక్తిత్వం అలవడదు.

3. మన వ్యక్తిత్వమూ మానసికావసరాలూ

పూర్వ వ్యాసంలో వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రాథమికావసరాలను వివరించాం. ఈ మారు వ్యక్తిత్వా పెంపునకు దెచ్చే మానసికావసరాలను గూర్చి విచారిద్దాం.

1. సావిత్రి, సుజాత యిద్దరూ హైస్కూలు విద్యార్థినులు. సావిత్రి డిసెంబరు పరీక్షల మార్కులు చూచుకుంది. అంత మంచి మార్కులు రాలేదు. అసలు తాను బాగా చదవలేదు. ఇంకా పాడు మార్కులు రావలసింది. టీచర్ల కృపవల్ల ఆపాటి మార్ములైనా వచ్చాయి. ఆయమ్మాయి "ఇకమీదట నయినా జాగ్రత్తగా చదువుతాను. వచ్చే పరీక్షల్లో యొక్కువ మార్కులు సంపాదిస్తాను” అనుకుంది. నిబ్బరంగా ఉండి పోయింది.

సుజాత హైస్కూలు సంగీతం పోటీతో పాల్గొని ఓడిపోయింది. నళిని