పుట:Lokokthimukthava021013mbp.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1523 తలతోకలెని కధ ముక్కుముఖములేనిపిల్ల

1524 తలారిపగ తలతోతీరుతుంది

1525 తలుపులుమింగేవానికి అప్పడాలు లొటలొట

1526 తల్లియైనా పిల్లయేడవంది పెట్టదు

1527 తల్లిచేసింది తనయులకు

1528 తల్లిబంగారైనా కంసాలివాడు దొంగిలకమానడు

1`529 తల్లికడుపుచూచును పెండ్లాము వీపుచూచును

1530 తల్లికడుపులో చొరకముందు దయ్యాలదేవత భూమిలో పుట్టినతర్వాత దయ్యాల దేవత

1531 తల్లికికానివాడు దాయాదికౌనా

1532 తల్లికికూడు పెట్టనివాడు తగుదునమ్మా అనితీర్చవచ్చినట్లు

1533 తల్లికికొట్టరా వసంతం

1534 తల్లికితగినబిడ్డ యింటికితగిన వందిలి

1535 తల్లిగండము పిల్లగండము మంత్రసానిగండమున్నదా

1536 తల్లిచనిపోతే తండ్రి పైనతండ్రితో సమానము

1537 తల్లిచేసే కడుపుపెద్ద, తలమాస్తే కొప్పుపెద్ద

1538 తల్లిచాలు పిల్లలకు తప్పుతుందా

1539 తల్లిచెవులకన్నా పినతల్లిచెవులు మేలు

1540 తల్లిచెఫులు మద్దికాయలు దండుగలకు పెండ్లాంమెళ్ళో పూసలు భోగాలవారికి

1541 తల్లిచెవులు తెంచినవానికి ముత్తవచెవులు వెంట్తుక మాత్రం

1542 తల్లిదే వలపక్షం ధరణిదే వలపక్షం