పుట:Lokokthimukthava021013mbp.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1501 తప్పతాగి కులంమరచినట్లు

1502 తప్పులువెతికేవాడు తండ్రితప్పులు వెతికేవాడు ఓర్వలేనివాడు

1503 తప్పులులేనివారు ధరణిలోలేరు

1504 తప్పులేనివాణ్ణి ఉప్పులోవూరయ్య మన్నాడట

1505 తప్పూఒప్పూ దైవమెరుగును పప్పూకూరబాపడెరుగును

1506 తప్పెటకొట్టినవాడు దాసరి శంఖంవూదినవాడు జంగం

1507 తరిఅంటే వరిఅంటాడు తిరిగిఅంటే గొంతుకు ఉరి

1508 తమామూలేకుంటే తవ్వెడైనా అడిగినట్లు

1509 తమ్ముడు తనవాడేగాని తప్పుతనదా

1510 తలక్రిందికొరవి

1511 తలంటబలగమేగాని తలకుపెట్టేవారు లేరు

1512 తలకుమించిన ఆజ్ఞలేదు

1513 తలకోసుకపోగా పోగులకు యేడ్చినట్లు

1514 తలకోసి ముందరపెట్టితే గారడీవిద్యాన్నట్లు

1515 తలగట్టి కడుపుగుల్ల

1516 తలచినప్పడీ తాతపెళ్లి

1517 తలగడక్రిందిపాము

1518 తలకాయలోకిదూర్చిన తాబేలువలె

1519 తలతడిసినమట్టుకు గొరిగే తీరవలెను

1520 తలతిరిగియైనా కబళం నోట్లోకే రావలెను

1521 తలప్రాణం తోకకువచ్చినది

1522 తలలు బోడులైనా తలుపులుబోడులా