పుట:Lokokthimukthava021013mbp.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1482 తన తలుపుతీసి పొరుగింటికి బెట్టి రాత్రంతా కుక్కల తోలుతూ కూర్చున్నట్లు

1483 తనతల్లిచావుకన్నా పినతల్లిచావుమేలు

1484 తననీడె తనకుశాచం

1485 తనదాకావస్తే గాని తలనొప్పి బాధతెలియదు

1486 తననీడ తనతోనే వుంటుంది

1487 తనదీపమని ముద్దుపెట్టుకుంటే మూతిమీసాలుకాలును

1488 తననుపొడిచిన గంగిగోవునైనాపొడిస్తే పాపంలేదు

1489 తనపిల్ల తవిటికేడిస్తే లంజపిల్ల రాగిరేకు కేడ్చినది

1490 తనపుట్టి పిచ్చగావుంటే, పొరుగు పందుం సరాకొలిచి నాడట

1491 తనబంగారం కాకపొతే వన్నెలేదు మెరుపు లేదు

1492 తనబలిమికన్నా స్థానమలిమిమేలు

1493 తనముడ్దికాకపోతే కాశీదాకా దేకమన్నట్లు

1494 తనముడ్ది కాకపోతే గంగదాకా తాటిపట్టికెదురు దేకమన్నట్లు

1495 తనలొ తప్పులెకుంటే గురువుతో గుద్దులాడవచ్చునట

1496 తనయుని పుటక తల్లికి తెలుసు

1497 తనవారు లోతుకుతీతురు కానివారు కడకు తీతురు

1498 తనవాసితప్పితే ఒకవన్నె తరుగును

1499 తనువులు నిత్యములేదుగాని ఓలిపైకము ఖర్చుపెట్టకు అన్నట్టు

1500 తన్నుగట్టతాళ్లు తానేతెచ్చుకొనినట్లు