పుట:Lokokthimukthava021013mbp.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1441 డబ్బు యిచ్చి తేలు కుట్టించుకున్నట్లు

1442 డబ్బు సభగట్టును, ముద్ద నోటినిగట్టును

1443 డబ్బూ యివ్వను డబ్బుమీద దుమ్మూ యివ్వను

1444 డబ్బుకు వచ్చినచెయ్యి వరహాకువస్తుంది

1445 డబ్బులకు ప్రాణానికి లంకె

1446 ఢిల్లికి ఢిల్లి పల్లెకు పల్లి

1447 డొంకలోషరాపువున్నాడు నాణెములుచూపుకోవచ్చును

1448 తంగేడు పూచినట్లు

1449 తంటాలమారి గురానికి తాటిపట్ట గొరపం

1450 తండ్రి తవ్విన నుయ్యి అని అందులో దూకవచ్చునా

1451 తండ్రిని చంపిన పాపం అత్తవారింట అంబటికట్ట తెగితే పోతుంది

1452 తండ్రిసేద్యం కొడుకు వైద్యం, కూడుమధ్యం

1453 తంబళ అనుమానము

1454 తంబళి తన లొటలొటేగాని యెదుటివారి లొటలొట యెరుగడు

1455 తక్కువ నోమునోచి యెక్కువఫలము రమ్మంటేవస్తుందా

1456 తగవరి కూలికి విషము త్రాగడు

1457 తగవున నోడినను ముదిమిని చచ్చినను బందిలేదు

1458 తగిలినకాలే తగులు తుంది

1459 తగినట్లే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ