పుట:Lokokthimukthava021013mbp.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1163 గురువుమాట మీరరాదు గడ్డపారమింగరాదు

1164 గురువు నిలుచుండి తాగితే శిష్యుడు పరుగెత్తుతూ తాగుతాడు

1165 గుఱ్ఱం గుడ్దిదైనా దాణాతప్పదు

1166 గుఱ్ఱం చచ్చిందికాక గుంటత్రవ్వుటకు నొకరూక

1167 గుఱ్ఱపుచూపు గొర్రెతినుడు

1168 గుఱ్ఱపుతోకకు కళ్లెంపెట్టినట్లు

1169 గుఱ్ఱపుబండికి వొంటెద్దులబండి ఆదర్శంగా

1170 గుఱ్ఱం పేరు గోడ అయితే జీనుపేరు!మదురు. యింక అంతా తెలుసును

1171 గుఱ్ఱం వలె కుక్కనుపెంచి రెడ్డి తానే మొరిగెనట

1172 గుఱ్ఱానికి కడుపు మాడితే ఆరిక కసరైనా తింటుంది

1173 గుఱ్ఱానికి గుగ్గిళ్ళు తినవేర్పవలెనా

1174 గుఱ్ఱమును తిన్నకుక్క అదేమి బ్రతుకును

1175 గుఱ్ఱానికీ తోకవుంటే అదే విసురుకుంటుంది కాని సావిట్లో గుఱ్ఱాలన్నింటికీ విసుతుందా?

1176 గువ్వగూడెక్కె అవ్వమంచమెక్కె

1177 గుసగుసయోచనలు గుడికిచేటు

1178 గుళ్లోదేముడికి వైద్యంలేకుంటే బూజారి పులిహోరకు యేడ్చినాడట

1179 గుళ్లుమింగేవానికి గుడిలింగాలు లక్ష్యమా